E-Paper
Advertisement

Aadi Saikumar: ‘శంబాల’ తర్వాత ఆది చేస్తున్న చిత్రమిదే.. మళ్లీ హిట్ కొడతాడా?

Aadi Saikumar: ‘శంబాల’ తర్వాత ఆది చేస్తున్న చిత్రమిదే.. మళ్లీ హిట్ కొడతాడా?
Advertisement

Aadi Saikumar: హిట్ సినిమా పడక చాలా ఒత్తిడిలో ఉన్న ఆది సాయికుమార్‌ (Aadi Saikumar)కు ‘శంబాల’ (Shambhala) రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఆయన కొన్నాళ్ల పాటు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. కాకపోతే, ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగు ఆయన చాలా జాగ్రత్తగా వేయాలని, ఇటీవల ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఈవెంట్స్‌లో పెద్దలు ఆయనకు సూచించారు. ఆది సాయికుమార్ కూడా ఇకపై ఏ కథ పడితే ఆ కథ ఓకే చేయకుండా, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఆది సాయికుమార్ చేయబోయే తదుపరి చిత్రం కూడా ‘శంబాల’ తరహాలోనే మూడు అక్షరాలతోనే ఉండబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Tollywood: ఎపిసోడ్ డైరెక్టర్‌ గా కెరియర్ మొదలు.. కట్ చేస్తే మూవీస్ లో స్టార్ స్టేటస్.. లిస్ట్ పెద్దదే!

‘శంబాల’ తర్వాత ఆది చిత్రమిదే..

Advertisement

‘శంబాల’ సక్సెస్ తర్వాత మరోసారి కంటెంట్ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆది సాయికుమార్ సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక (Vedhika) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ (Jungle). సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ తెలియజేశారు. ఫ్రైడే పిక్చర్స్ పతాకంపై రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్చ్ చేతిలోనే ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ‘శంబాల’ కంటే ముందే రావాల్సింది. అప్పట్లో వచ్చిన టీజర్ కూడా చాలా మంచి స్పందనను రాబట్టుకుంది.

Also Read- OTT Releases This Week : ‘మన శంకర వర ప్రసాద్’ నుంచి ‘అనగనగా ఒక రాజు’ వరకు… ఈ వీకెండ్ తెలుగు సినిమాల పండగ

హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో..

Advertisement

‘శంబాల’ సక్సెస్‌తో ఈ సినిమా నిర్మాతలకు ఫుల్ కాన్ఫిడెంట్ రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌తో తెలిపారు. ఈ మూవీలో కూడా ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సీట్లలో నుంచి కదలకుండా చేస్తుందని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. త్వరలో ట్రైలర్‌తో పాటు మరిన్ని అప్డేట్స్‌ను ఇస్తామని ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.

Also Read- Funky: ‘ఫంకీ’ యమా యమ్మ వీడియో సాంగ్ ఎలా ఉందంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×