E-Paper
Advertisement

Puja Items: పూజ గదిలో ఆ వస్తువులు దరిద్రానికి సంకేతాలట – ఏ వస్తువులో తెలుసా

Puja Items: పూజ గదిలో ఆ వస్తువులు దరిద్రానికి సంకేతాలట – ఏ వస్తువులో తెలుసా
Advertisement

Puja Items: ఇంట్లో పూజా మందిరంలో కొన్ని వస్తువులు అసలు ఉంచకూడదట. అలా ఉంచినట్లయితే.. ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పెరగటమే కాకుండా ఇంట్లో సకల దరిద్రాలకు అవి వెల్‌కం చెప్తాయట. ఇంతకీ ఏఏ వస్తువులు పూజా మందిరంలో ఉంచకూడదో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

అగ్గిపెట్టె:

ఇంట్లోని పూజా మందిరంలో అగ్గిపెట్టె పెట్టకూడదట. దీనివల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట. కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందట.

పెద్ద శివలింగాలు పెట్టుకోకూడదు:

Advertisement

ఎవరైనా ఇంట్లో పూజా మందిరంలో పెద్ద పెద్ద సైజు ఉన్న శివ లింగాలు పెట్టకోకూడదని శాస్త్రం చెప్తుందట. ఒకవేళ శివలింగం పెట్టుకుని పూజ చేసుకోవాలన్న అభీష్టం ఉంటే.. అంగుళం కన్నా చిన్నదైన శివలింగాన్ని పెట్టుకుని పూజించుకోవచ్చట. ఒకవేళ పెద్ద సైజు శివలింగాలు ఉంటే ఆ ఇంట్లో నెగటివిటీ పెరుగుతుందట.

ఉగ్రరూపంలో ఉన్న దేవీ దేవతల ఫోటోలు, ప్రతిమలు:

ఇంట్లో పూజా మందిరంలో కచ్చితంగా ఉండకూడని ఫోటోలు కానీ ప్రతిమలు కానీ ఏవైనా ఉన్నాయంటే అవి ఉగ్ర దేవీ దేవతలవి అని చెప్తుంటారు పండితులు. ఇవి ఉండటం వల్ల ఇంట్లో అశుభం జరుగుతుందని హెచ్చరిస్తుంటారు.

ఉగ్రరూపంలో ఉన్న హనుమాన్‌:

Advertisement

ఇక ఉగ్ర రూపంలో ఉన్న హనుమంతుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోకూడదట. దీని వల్ల ఇంట్లో నష్టాలు జరుగుతాయని చెప్తుంటారు పండితులు.

నటరాజ మూర్తి:

ఇంట్లో అసలు ఉంచకూడని ఫోటోలు, విగ్రహాలలో నటరాజస్వామిది అని చెప్తున్నారు పండితులు. అయితే ఈ నటరాజ స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ విద్యాలయాలలో కానీ నాట్య కళాశాలలో కానీ కచ్చితంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

తాండవం చేస్తున్న శివుడు:

ఇంట్లో దేవుని మందిరంలో తాండవం చేస్తున్న శివుడి ఫోటోలు కూడా అసలు పెట్టుకోకూడదట.

ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉండకూడదట:

ఇంట్లో శంఖం పెట్టుకోవడం శుభ సూచకంగా భావిస్తారు. కానీ శంఖం ఒకటి కంటే ఎక్కువ ఇంట్లో పెట్టుకోకూడదని చెప్తున్నారు పండితులు. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ శంఖాలు ఉంటే మిగతావన్నీ తీసుకెళ్లి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.

చనిపోయిన వారి ఫోటోలు:

ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరంలో పెట్టకూడదట. ఒకవేళ పూర్వీకులకు పూజ చేయాలనుకుంటే ప్రత్యేకంగా ఒక మందిరం ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కానీ దేవుని ఫోటోలు, విగ్రహాల పక్కన అసలు పెట్టకూడదట.

వాడిన సామాగ్రి ఉంచకూడదు:

ప్రతి రోజూ ఇంట్లో దేవుని పూజ కోసం వాడిన పూలు, వత్తుల ఇతర సామాగ్రి మరుసటి రోజు తప్పనిసరిగా దేవుని మందిరంలోంచి తీసివేయాలని సూచిస్తున్నారు. అలా తీసివేయకపోతే ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన వారికి అకస్మికంగా లవ్ మ్యారేజ్ అవుతుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×