E-Paper
Advertisement

Shambhala Day 1 Collections: ఆది శంభాల ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లలంటే?

Shambhala Day 1 Collections: ఆది శంభాల ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లలంటే?
Advertisement

Shambhala Day 1 Collections: టాలీవుడ్ సీనియర్ హీరో వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రేమ కావాలి అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు ఆది సాయికుమార్(Aadi Sai Kumar). మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఆది అనంతరం పలు సినిమాలలో నటించినా, పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన ఆది చాలా రోజుల తర్వాత శంభాల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన ఆది..

ఆది సాయికుమార్, అర్చన అయ్యర్(Archana Iyer) జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చాలా రోజుల తర్వాత ఆది స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటిరోజు ఎంతో విజయవంతంగా ప్రసారం కావడంతో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

మొదటిరోజు 3.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు..

Advertisement

ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మరికొన్ని థియేటర్లను పెంచబోతున్నట్టు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే పోస్ట్ ను ఆది సాయికుమార్ సైతం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల చూపిస్తున్న ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే శంభాల సినిమా చూడాలని ఈ సందర్భంగా కోరారు . ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది.

Advertisement

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. శంభాల బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనించాలి అంటే సుమారు 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాల నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించేనా? లేదా? అనేది తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా సైన్స్ అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న శంభాల అనే గ్రామంలో జరిగే అతీంద్రియ శక్తులు, భయానక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆది సాయికుమార్ ఇదివరకు ఎప్పుడూ నటించని విధంగా సరికొత్త జోనర్ టచ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

Also Read: Most Searched Actors: 2025 మోస్ట్ సెర్చెడ్ హీరోగా టాలీవుడ్ స్టార్.. అస్సలు తగ్గట్లేదుగా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×