E-Paper
Advertisement

Anasuya: స్విమ్ సూట్‌లో అనసూయ.. మిస్ అవుతున్నా అంటూ వీడియో.. ఈ టైమ్‌లో అవసరమా?

Anasuya: స్విమ్ సూట్‌లో అనసూయ.. మిస్ అవుతున్నా అంటూ వీడియో.. ఈ టైమ్‌లో అవసరమా?

Anasuya:అనసూయ.. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేని పేరు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాగ’ సినిమాలో లా స్టూడెంట్ గా సునీల్ వెనుక ఒక పాత్రలో నటించి తన కెరీర్ ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత న్యూస్ రీడర్ గా కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేసి తన వాక్చాతుర్యంతోనే కాదు అందచందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తున్నప్పుడే సినిమాలలో కూడా నటిగా అవకాశాన్ని దక్కించుకొని నటిగా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప సినిమాలో ద్రాక్షాయనిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.

స్విమ్ సూట్ లో అనసూయ..

అంతేకాదు గ్లామర్ డోస్ ఒలకబోసేలా ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. అలాగే సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె తాజాగా స్విమ్ సూట్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అనసూయ షేర్ చేసిన ఆ వీడియోలో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి గ్లామర్ డోస్ పెంచి మరీ మిస్ అవుతున్నా అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన స్విమ్ సూట్ అభిమానులను ఆకట్టుకున్నా.. అసలే ఇండస్ట్రీలో హీరోయిన్ల వస్త్రధారణ పై శివాజీ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తుంటే.. ఇలాంటి పరిస్థితుల్లో స్విమ్ సూట్ వీడియో పోస్ట్ చేయడం అవసరమా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరోసారి వివాదానికి తెర లేపిన అనసూయ..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై చాలామంది హీరోయిన్స్ శివాజీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వివాదంలోకి అనసూయ కూడా ఎంట్రీ ఇవ్వగా తాజాగా అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది..తన వయసును , వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ తనదైన శైలిలో చురకలు అంటిస్తోంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును అడ్డం పెట్టుకొని తనను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

సమాజంలో స్వతంత్రంగా ఉండే మహిళలను భయంతో నియంత్రించాలని చూసేవారు ఇలాంటి పితృస్వామ్య అహంకారంతో ప్రవర్తిస్తారని.. గత తరాలు నేర్చుకున్న తప్పుడు పద్ధతులు లేదా పాతకాలపు ఆలోచనలను మనం అలాగే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతేకాదు ఆడవాళ్ల వస్త్రధారణ పై శివాజీ చేసిన కామెంట్లకు ధీటుగా ఇప్పుడు తన అందాలు ఆరబోస్తూ ఇలా స్విమ్ సూట్ ధరించింది అనసూయ. మొత్తానికి అయితే శివాజీకి మరోసారి తన వస్త్రధారణతో కౌంటర్ వేసింది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు .

ALSO READ:Chitra Rai: పెళ్లిరోజే మరో బిడ్డను ఆహ్వానించిన దేవర బ్యూటీ..

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×