E-Paper
Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. పుత్రోత్సాహమా? లేక?

కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. పుత్రోత్సాహమా? లేక?
Advertisement

Aamir Khan:బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? అంటూ అభిమానులు కూడా కంగారుపడగా అసలు విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరు ? అసలు ఏమైంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్..

అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో ఆయన వారసుడు జునైద్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ‘ఏక్ దిన్’. దీనిని తెలుగులో ‘ఒక రోజు’ అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. కొడుకు జునైద్ ఖాన్ తొలి సినిమా కావడం, ఈ సినిమాలో నేచురల్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్గా నటించడం అన్నీ ఈ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ షో ఇటీవల వేయగా ఇది చూసిన అమీర్ ఖాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కుమారుడి నటనను చూసి ఒక తండ్రిగా ఆయన పుత్రోత్సాహంతో గర్వపడ్డారు .ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ అమీర్ ఖాన్ లోని ఎమోషనల్ ఫాదర్ ను చూసి మురిసిపోతున్నారు. మొత్తానికైతే పుత్రోత్సాహంతో అమీర్ ఖాన్ కళ్ళల్లో నీళ్లు పొంగడం చూసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏక్ దిన్ సినిమా విశేషాలు..

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే ఏక్ దిన్ ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా అని చెప్పవచ్చు . జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే ఒకటవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే జునైద్ ఖాన్ కొన్నేళ్లుగా థియేటర్ ఆర్ట్స్ లో కఠిన శిక్షణ పొంది, ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

ALSO READ:హీరో, అతడి భార్య వల్లే నా కెరియర్ నాశనమవుతోంది..యువనటి ఎమోషనల్ వీడియో వైరల్!

పుత్రోత్సాహంలో అమీర్ ఖాన్..

Advertisement

అమీర్ ఖాన్ పుత్రోత్సాహంతో తన కుమారుడి గురించి మాట్లాడుతూ.. “జునైద్ తన కెరియర్ మరియు కథల ఎంపిక విషయంలో స్వతంత్రం గానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నా స్టార్ డంను ఏమాత్రం వాడుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు” అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అటు జునైద్ తొలి సినిమాతో నిరూపితం కాబోతున్నాయని నెటిజెన్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి విషయానికొస్తే.. ఇందులో ఎప్పటిలాగే మరొకసారి తన నేచురల్ నటనతో ఆకట్టుకోబోతోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్లో అది నిరూపితం అయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె హిందీ రామాయణం సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Related News

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

Big Stories

Advertisement
×