E-Paper
Advertisement

ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్.. ఏంటీ స్వాతంత్ర్యానికి ముందే పరుగులు తీసిందా?

ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్.. ఏంటీ స్వాతంత్ర్యానికి ముందే పరుగులు తీసిందా?
Advertisement

First Electric Train in India: భారతీయ రైల్వే అత్యంత పురాతనమైనది. సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. నెమ్మదిగా ఇండియన్ రైల్వేలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పుల్లో ఒక ముఖ్యమైన మైలురాయి విద్యుత్ రైళ్ల ప్రారంభం. ఈ రైళ్లు దేశ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. కానీ, భారత్ లో తొలి విద్యుత్ రైలు ఎప్పుడు ప్రారంభం అయ్యిందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1925లో తొలి విద్యుత్ రైలు సేవలు షురూ

భారత్ లో తొలిసారి 1925 ఫిబ్రవరి 3న తొలి విద్యుత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైలు బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్ స్టేషన్ నుంచి కుర్లా హార్బర్ వరకు నడిచింది. ఈ ప్రారంభం ఆ కాలంలో చాలా పెద్ద సాంకేతిక విప్లవంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే, అప్పటి వరకు ఎక్కువగా ఆవిరి ఇంజిన్లపై ఆధారపడిన రైల్వే వ్యవస్థ, విద్యుత్ ఆధారిత రైళ్ల వైపు మళ్లడం మొదలయ్యింది.

విద్యుత్ రైళ్ల రాకతో వేగవంతమైన ప్రయాణం

Advertisement

విద్యుత్ రైళ్లు రావడం వల్ల ప్రయాణం మరింత సులభంగా, వేగంగా మారింది. ఆవిరి ఇంజిన్లతో పోలిస్తే ఇవి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ కారణాలతో రైల్వే శాఖ విద్యుతీకరణపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. తొలినాళ్లలో ఈ సేవలు కేవలం చిన్న మార్గంలో మాత్రమే కొనసాగినా,  తర్వాత దశలవారీగా విస్తరించారు. ముంబై ప్రాంతం నుంచి ఈ విద్యుత్ లైన్‌ ను నాసిక్ సమీపంలోని ఇగత్‌ పురి వరకు విస్తరించారు. గిరి ప్రాంతాల్లో రైళ్లను సులభంగా నడపడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఈ సేవలను పూణే వరకు కూడా తీసుకెళ్లారు. నెమ్మదిగా విద్యుత్ రైళ్ల పరిధి క్రమంగా పెరుగుతూ వచ్చింది.

విద్యుత్ రైళ్ల వల్ల ప్రయాణికులకు బోలెడు లాభాలు కలిగాయి. రైళ్లు వేగంగా నడవడం, స్టేషన్ల మధ్య సమయం తగ్గడం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరంగా మారింది. ముంబైలో లోకల్ ట్రైన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంలో కూడా విద్యుత్ రైళ్ల పాత్ర చాలా కీలకంగా మారింది.

పర్యావరణ అనుకూలమైన ప్రయాణం

Advertisement

విద్యుత్ రైళ్లు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇంధన వినియోగం తగ్గడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో మరింత స్థిరమైన రవాణా వ్యవస్థకు దారితీసింది. 1925లో ప్రారంభమైన ఈ విద్యుత్ రైలు ప్రయాణం, తర్వాత దేశ రైల్వే వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని మార్గాలు విద్యుతీకరించబడ్డాయి. ఇది రైల్వే రంగంల ఓ పెద్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. దేశంలో మొదటి విద్యుత్ రైలు ప్రారంభం కేవలం ఒక కొత్త సేవ మాత్రమే కాదు, రవాణా రంగంలో అభివృద్ధికి బాటలు వేసిన ఒక చారిత్రక ఘట్టం. దేశ ప్రగతికి కారణమైన అత్యంత కీలకమైన అడుగుగా నిలిచింది.

Read Also: అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×