E-Paper
Advertisement

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Soundarya: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత అంతటి కట్టుబొట్టుతో సాంప్రదాయంగా నటిస్తూనే.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్గా సౌందర్య (Soundarya) పేరు సొంతం చేసుకుంది. అందం, అభినయంతో, నటనతో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. సౌందర్య లాంటి తెలివైన, అందమైన , గొప్ప భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇలా యాక్సిడెంట్ లో మరణించడాన్ని అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరు సౌందర్యాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్యాను గుర్తు చేసుకుంటూ ఆమె మరణించిన తర్వాతే “మిస్ యూ ” అనే మాటకు బరువైన అర్థం తనకు తెలిసింది అంటూ ఒక స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్లు చేశారు.

సౌందర్య మరణంతో “మిస్ యూ” అర్థం తెలిసింది – అర్జున్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ.. “అందానికి అందం, అంతకుమించిన అద్భుతమైన సహజ నటనతో కోట్లాదిమంది అభిమానులను సౌందర్య సంపాదించుకున్నారు. నాకు కేవలం ఆమె ఒక కోస్టార్ మాత్రమే కాదు.. నా జీవితంలో లభించిన అత్యుత్తమ స్నేహితురాలు. ఒకరిని కోల్పోతే కలిగే శూన్యం ఎంతటిదో మిస్ యూ అనే చిన్న మాటకు ఎంతటి బరువైన అర్థం ఉందో.. సౌందర్య మన మధ్య లేకపోవడంతోనే నాకు అర్థం అయింది . ఆమె భౌతికంగా దూరమైన తర్వాతే నా జీవితంలో ఆమె ఎంతటి స్థానాన్ని ఆక్రమించిందో మరింత లోతుగా అర్ధమయ్యింది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు యాక్షన్ హీరో అర్జున్. సౌందర్య మరణం పై అర్జున్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సౌందర్య – అర్జున్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు..

Advertisement

సౌందర్య – అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో చిత్రాలు వెండితెరపై ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశాయి. 1998లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘శుభవార్త’తో మొదలైన వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. ఆ తర్వాత వచ్చిన ‘ శ్రీ మంజునాథ’లో మరింత అద్భుతంగా పండింది. ఈ భక్తిరస చిత్రం ఈ జంటకు ఊహించని విజయాన్ని అందించింది.

ALSO READ:కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

ఊపిరి ఉన్నంతవరకు శాశ్వత చిరునామా..

Advertisement

ముఖ్యంగా వీరి స్నేహం షూటింగులకే పరిమితం కాకుండా ఒక ఆప్తురాలిగా సౌందర్య నిలిచారు పరిశ్రమలో ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండే సౌందర్య వ్యక్తిత్వం, మనుషులతో ఆమె మమేకమయ్యే తీరు ఎప్పటికీ మరువలేనివి అంటూ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు అర్జున్.. నా ఊపిరి ఉన్నంతవరకు ఆమెతో ఉన్న పవిత్రమైన స్నేహం ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆమె జ్ఞాపకాలు నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. నా ఊపిరి ఉన్నంతవరకు ఆమెకు నా హృదయం శాశ్వత చిరునామా అంటూ అర్జున్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×