Medchal Accident: మేడ్చల్ జాతీయ రహదారిపై ఐటీఐ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 36 E 123 నంబర్ గల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది.ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం.
అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం కోల్తూరు గ్రామానికి చెందిన సురేష్, శ్రీకాంత్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Also read: కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వారం రోజుల క్రితమే ఇదే జాతీయ రహదారిపై రేకులభావి సమీపంలో జరిగిన కారు ప్రమాదం మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!