E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!
Advertisement

Redmi Watch 6 Active: స్మార్ట్‌వాచ్ అంటేనే భారీ ధర ఉండాల్సిన పనిలేదు. సామాన్యులు సైతం కొనగలిగేలా, రోజువారీ అవసరాలకు సరిపడే ఫీచర్లు దొరికితే చాలు అనుకునేవారికి రెడ్‌మీ ఓ కొత్త ఆప్షన్‌ను సిద్ధం చేస్తోంది. అదే ‘రెడ్‌మీ వాచ్ 6 యాక్టివ్’. గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షియోమీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో దీని వివరాలు కనిపించడంతో లాంచ్‌పై ఆసక్తి పెరిగింది. మరి ఈ వాచ్ ప్రత్యేకత ఏంటి? బడ్జెట్‌లో కొనాలనుకునేవారికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ డిస్‌ప్లే, స్టైలిష్ లుక్:

ఈ వాచ్‌కి ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్ అని చెప్పొచ్చు. ఇందులో 1.85 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. అంతేకాదు.. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల మండు వేసవిలో, ఎండలో ఉన్నా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోజూ పెట్టుకోవడానికి వీలుగా కేవలం 26 గ్రాముల బరువుతో, చాలా తేలికగా ఉంటుంది. మన డ్రెస్సింగ్‌కి తగ్గట్టు స్ట్రాప్స్ వేగంగా మార్చుకునే క్విక్ రిలీజ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

Advertisement

Also Read: Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

హెల్త్‌పై కంట్రోల్, స్పోర్ట్స్ మోడ్స్:

ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం ఇందులో ఏకంగా 140కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. దీంతో మనం చేసే ప్రతి వర్కవుట్‌ను ట్రాక్ చేయవచ్చు. గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఒత్తిడిని కొలిచే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. రోజువారీ వాడకంలో దుమ్ము, నీటి వల్ల ఎలాంటి ఇబ్బంది కాకుండా ఐపీ68 రేటింగ్ ప్రొటెక్షన్ ఇచ్చారు.

హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్:

Advertisement

ఫోన్ జేబులోంచి తీసే అవసరం లేకుండా నేరుగా వాచ్ నుంచే మాట్లాడేందుకు బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది. ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, వచ్చిన కాల్స్ మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాచ్‌లో 470mah బ్యాటరీని అమర్చారు. సాధారణ వాడకంలో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 12 రోజుల పాటు వస్తుంది. తక్కువగా వాడితే ఏకంగా 18 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. వివిధ దేశాల్లో దీని ధర రూ.3,700 – రూ.5,300 మధ్యలో ఉంది. పన్నుల ఆధారంగా మన దగ్గర ఈ ధర మారవచ్చు. త్వరలోనే అధికారిక లాంచ్ డేట్ రానుంది.

Also Read: కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

Tags

Related News

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×