E-Paper
Advertisement

Action King Arjun: ‘జెంటిల్‌మెన్’కు మొదట అనుకున్న హీరో నేను కాదు.. ఎవరంటే?

Action King Arjun: ‘జెంటిల్‌మెన్’కు మొదట అనుకున్న హీరో నేను కాదు.. ఎవరంటే?
Advertisement

Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అంటే అది ఖచ్చితంగా ‘జెంటిల్‌మెన్’ (Gentleman) చిత్రమనే చెప్పాలి. అంతకు ముందు వరకు వరసగా ప్లాపుల్లో ఉన్న అర్జున్‌ని ఒక్కసారిగా స్టార్‌ని చేసిందీ చిత్రం. దర్శకుడు శంకర్ (Director Shankar) సృష్టించిన ఈ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా, అర్జున్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా అర్జున్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయన మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో అర్జున్ ఈ సినిమా హీరో వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?

మొదట అనుకున్న హీరో ఎవరంటే?

Advertisement

ఈ ప్రాజెక్ట్ కోసం మొదట హీరోగా అర్జున్ కాకుండా, శరత్‌కుమార్‌ (Sarathkumar)ను అనుకున్నారట. అంతేకాకుండా శరత్‌కుమార్‌తో ఫోటోషూట్ కూడా పూర్తయిందని, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా తన దగ్గరకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఒక్క సినిమాతోనే అప్పట్లో సౌత్ ఇండియాలో అర్జున్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. అయితే చిత్రమేంటంటే, ఈ సినిమాను అర్జున్ మొదట తిరస్కరించాలని అనుకున్నారట. ఆ సమయంలో చిత్ర పరిశ్రమపై ఆయనకు తీవ్రమైన అసంతృప్తి, కోపం ఉండేదని తెలిపారు. తను కష్టాల్లో ఉన్నప్పుడు పరిశ్రమలో ఎవరూ ఆదుకోలేదని, అందుకే సినిమాలకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం ఒక టెక్నీషియన్ పదే పదే అడుగుతున్నాడనే కారణంతో, కనీసం కథ విని ‘చేయను’ అని మొహం మీద చెప్పేద్దామని ఫిక్స్ అయ్యారట.

Also Read- Film Distribution: అన్నపూర్ణ ఎంట్రీ వెనుక దిల్ రాజు వ్యూహమిదేనా? వారికి చెక్ పెట్టేందుకేనా?

నిర్ణయం మార్చుకున్న అర్జున్

Advertisement

కానీ కథ విన్నాక ఆ నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదని అర్జున్ తెలిపారు. ఆ కథలోని కంటెంట్, శంకర్ విజన్ అర్జున్‌ని ఎంతగానో కట్టిపడేశాయట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ‘జెంటిల్‌మెన్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా, అర్జున్‌ని ‘యాక్షన్ కింగ్’గా స్థిరపరిచింది. ఒకవేళ ఆరోజు ఆయన కోపంతో ఆ సినిమాను వదులుకుని ఉంటే, టాలీవుడ్, కోలీవుడ్ ఒక అద్భుతమైన యాక్షన్ స్టార్‌ను మిస్ అయ్యేవి. తన జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో వచ్చిన ఈ సినిమా, మళ్ళీ తనను వెండితెరపై నిలబెట్టిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఒక అద్భుతమైన కథ నటుడిని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

Also Read- Akira Nandan: అకీరా నందన్ ఎంట్రీ ఆ దర్శకుడితోనా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×