E-Paper
Advertisement

Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?

Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?
Advertisement

Tollywood: టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్స్‌కేం కొదవలేదు. బుల్లితెరపై డ్యాన్స్ షో‌లతో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ రెడీ అవుతున్నారు. అందరికీ పని దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. అలాంటి ఏదో రకంగా కొత్తగా ఆలోచించాలి. అదే చేశాడీ కొరియోగ్రాఫర్. ప్రభుదేవా (Prabhu Deva), రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మాస్టర్, విజయ్ బిన్నీ వంటి వారి తరహాలో తను కూడా మెగా ఫోన్ పట్టారు. అయితే ఆయన మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేసింది మాత్రం సినిమా కాదు. అసలా టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ ఎవరు? ఆయన ఏం చేశారనే విషయానికి వస్తే.. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు.. సత్య మాస్టర్. అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ (Satya Master) దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’ పేరుతో రెండు సాంగ్స్‌ని రూపొందించారు. ఈ పాటలకు కెకె రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

Also Read- Film Distribution: అన్నపూర్ణ ఎంట్రీ వెనుక దిల్ రాజు వ్యూహమిదేనా? వారికి చెక్ పెట్టేందుకేనా?

తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేశాం

Advertisement

జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించగా.. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు. తాజాగా ఈ సాంగ్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ.. నేను ఒక ఈవెంట్ నిమిత్తం యూఎస్‌కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్ కేకే రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్ హిందీ వెర్షన్ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను వారు నాతో షేర్ చేసుకున్నారు. అలా ఈ రెండు పాటలు తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాం. అతి తక్కువ మంది క్రూతో ఈ పాటలను తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేశాం. అన్నీ మేమే అయ్యి ఈ పాటలను చిత్రీకరించాం. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి ఎంతో ప్యాషనేట్‌గా ఈ పాటలను ప్రొడ్యూస్ చేశారు. జయంత్ మ్యూజిక్, లిప్సిక, అదితి పాడిన తీరు, రాంబాబు సాహిత్యం అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని అన్నారు.

Also Read- Sankranthi 2027: సంక్రాంతికి కర్చీఫ్‌లు సరే.. కథలు సిద్ధమయ్యాయా?

బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు

Advertisement

నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ.. మంచి లవ్ ఫీల్‌తో ఈ పాటలను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు మా డైరెక్టర్ సత్య. ఆయన కొరియోగ్రఫీ కూడా ఈ పాటలకు హైలైట్ అవుతుంది. లిప్సిక, అదితి ఈ పాటలను పాడిన విధానం చూస్తే వారికి గానకోకిల అని పిలవాలని అనిపిస్తోంది. జయంత్ మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయని తెలిపారు. హీరోయిన్ అంకిత జాదవ్ మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. ఈ రెండు పాటలను న్యూయార్క్, షికాగోలో షూటింగ్ చేశాం. అక్కడ అననుకూల వాతావరణంలో సాంగ్స్‌ను కష్టపడి చిత్రీకరించాం. సత్య మాస్టర్ డైరెక్షన్‌లో ఈ సాంగ్స్ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

Also Read- Akira Nandan: అకీరా నందన్ ఎంట్రీ ఆ దర్శకుడితోనా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×