Akira Nandan: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీనే అని చెప్పాలి. ఒక్క అకీరానే కాదు.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, మహేష్ బాబు తనయుడు గౌతమ్ అరంగేట్రం కోసం టాలీవుడ్ ఎంతగానో వేచి చూస్తోంది. మోక్షు ఎంట్రీ విషయంలో ఏం జరిగిందో తెలియంది కాదు. అలాగే మహేష్ కుమారుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో.. ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇక అకీరా విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అకీరా కనిపిస్తున్న తీరు, తన హైట్, పర్సనాలిటీ చూస్తుంటే వెండితెరపై పర్ఫెక్ట్ మెటీరియల్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. తాజాగా అకీరా అరంగేట్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో అకీరాను పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణే స్వయంగా తన ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌పై తన వారసుడిని గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని గట్టి ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తనయుడి కెరీర్ విషయంలో పవన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read- Anil Ravipudi: యాక్షన్.. కట్ మీరే చెప్పేయండి.. ఫైనల్లీ తన సినిమాపై అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములను సంప్రదించినట్లు వస్తున్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అకీరా వంటి కుర్రాడికి శేఖర్ కమ్ముల మార్క్ యూత్ ఫుల్ ఎంట్రీ అయితే ఒక స్వీట్ మెమరీలా ఉంటుందని పవన్ భావించారట. కాకపోతే, ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దగ్గర అకీరాకు సరిపోయే కథ సిద్ధంగా లేదని, ప్రస్తుతానికి ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో పవన్ వేరే ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శేఖర్ కమ్ముల ఓకే చెబితే మాత్రం, ‘లీడర్’ వంటి ఒక పొలిటికల్ టచ్ ఉన్న సినిమా లేదా ‘హ్యాపీ డేస్’ వంటి ఫ్రెష్ లవ్ స్టోరీతో అకీరా ఎంట్రీ ఉండవచ్చనేలా అప్పుడే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read- Bandwaale on OTT : షాలిని పాండే ‘బ్యాండ్ వాలే’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?
మరోవైపు పవర్ స్టార్ అభిమానుల ఆలోచనలు మాత్రం వేరే లెవల్లో ఉన్నాయి. అకీరా ఎంట్రీ అంటే క్లాస్‌గా కాకుండా మాస్ బ్లాస్ట్‌లా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ‘ఓజీ’ (OG) సినిమాతో పవన్ కళ్యాణ్‌ను పీక్ లెవల్ యాక్షన్‌లో చూపించిన దర్శకుడు సుజీత్ (Sujeeth) అయితేనే అకీరాకు కరెక్ట్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వీలైతే ‘ఓజీ’ సీక్వెల్‌లో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్రతో అకీరాను పరిచయం చేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని వారు భావిస్తున్నారు. సుజీత్ మేకింగ్ స్టైల్ అకీరా మేకోవర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఫైనల్‌గా ఏ దర్శకుడిని ఎంచుకుంటారో, అకీరా అరంగేట్రం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
Also Read- Harish Shankar: దేవి సమక్షంలో.. దేవుని పాట! హుషారుగా సాగిన ‘ఉస్తాద్’ సాంగ్ సిట్టింగ్స్