E-Paper
Advertisement

Dushyanth: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరొక టాలీవుడ్ హీరో.. ఘనంగా నిశ్చితార్థపు వేడుక!

Dushyanth: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరొక టాలీవుడ్ హీరో.. ఘనంగా నిశ్చితార్థపు వేడుక!
Advertisement

Dushyanth: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు వారికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అలాగే కొంతమంది నిశ్చితార్థం కూడా జరుపుకొని ఈ ఏడాది పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ నటుడు విజయ్ దేవరకొండ ,రష్మికల పెళ్లి ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన హడావిడి మొదలైంది. రష్మిక విజయ్ దేవరకొండతో పాటు మరొక హీరో అల్లు శిరీష్ కూడా పెళ్లికి సిద్ధమయ్యారు.

ప్రేయసి రచనతో దుష్యంత్ నిశ్చితార్థం..

అల్లు శిరీష్ వివాహం మార్చి ఆరో తేదీ ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించారు. అయితే త్వరలోనే మరో హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గత వైభవం(Gatha Vaibhavam) అటు తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు కన్నడ నటుడు దుష్యంత్(Dushyanth). గత వైభవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా దుష్యం సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థానికి(Engagment) సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement

మాజీ ఎంపీ కుమార్తెతో వివాహం..

దుష్యంత్ మాజీ ఎంపీ ఎస్పీ మద్దే హనుమాన్ గౌడ కుమార్తె రచన(Rachana)తో నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది .ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తుంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు కాబోయే దంపతులకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఈ జంట నిశ్చితార్థానికి పెళ్లికి పెద్దగా గ్యాప్ తీసుకోలేదని చెప్పాలి. వీరి నిశ్చితార్థం తాజాగా జరగగా వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ జరగబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంట మార్చి ఒకటో తేదీ ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా ప్రముఖ సినీ రాజకీయ నాయకులు హాజరు కాబోతుండడం విశేషం. ఇక వీరి వివాహం కూడా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లిరోజు కావటం విశేషం. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరగబోతుంది. అయితే ఈ వివాహపు వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇలా ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోయే ఈ జంట మార్చి 4వ తేదీ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Shivani Nagaram: ఇండస్ట్రీలోకి రాకముందు శివాని నాగారం ఆ పని చేసేదా.. పాకెట్ మనీ కోసమే అంటూ

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×