E-Paper
Advertisement

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే.. న్యాయం జరుగుతుందా?

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే.. న్యాయం జరుగుతుందా?
Advertisement

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు (Prathyusha Case)లో రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సుప్రీంకోర్టు (Supreme Court) రేపు (ఫిబ్రవరి 17) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తుది తీర్పును ఇవ్వబోతోంది. దీంతో అంతా, ఆమె మృతిపై ఎలాంటి తీర్పు రాబోతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె మృతి విషయంలో నిజానిజాలు బయటకు వచ్చి, నిందితులకు ధర్మాసనం శిక్ష విధిస్తుందని అంతా భావిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో ప్రత్యూష కేసుకు సంబంధించి కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై తుది వాదనలు విని తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీంతో.. ప్రత్యూష మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటనేది రేపటితో తెలిసిపోనుంది.

Also Read- Shivani Nagaram: ఇండస్ట్రీలోకి రాకముందు శివాని నాగారం ఆ పని చేసేదా.. పాకెట్ మనీ కోసమే అంటూ

అసలేం జరిగిందంటే..

Advertisement

1998లో మోహన్ బాబు (Mohan Babu) సినిమా ‘రాయుడు’తో ప్రత్యూష సినీ రంగప్రవేశం చేశారు. తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమెను అన్నయ్య పెంచి పెద్దచేశారు. అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ లవ్లీ స్మైల్’ టైటిల్ గెలుచుకున్న ఆమె చిరునవ్వు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా రంగంలోకి ప్రవేశించిన అనంతరం చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ నటి జీవితం అనూహ్యంగా విషాదాంతమైంది. ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి మధ్య ఉన్న సంబంధమే ఆమె మరణానికి కేంద్ర బిందువుగా మారింది. 2002లో వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో సిద్ధార్థ ప్రాణాలతో బయటపడగా, 22 ఏళ్ల ప్రత్యూష ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇది ఆత్మహత్యా? లేదంటే ప్లాన్‌తో చేసిన హత్యనా? అనే అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Also Read- Jyoti Poorvaj: నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న జ్యోతి!

తల్లి పోరాటం

Advertisement

ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థ రెడ్డికి అప్పట్లో సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో హైకోర్టు ఈ శిక్షను రెండేళ్లకు తగ్గించి, రూ. 50,000 జరిమానా వేసింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి చెందిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది ఆత్మహత్య కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆమె వాదిస్తూ వస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై తుది వాదనలు విని తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ప్రత్యూష మరణం వెనుక ఉన్న మిస్టరీకి రేపటి తీర్పుతో తెరపడే అవకాశం ఉంది. ప్రస్తుతం తుది తీర్పు వెలువడుతుండటంతో.. కచ్చితంగా ప్రత్యూష మృతికి న్యాయం జరుగుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read- Seyon First Look: శివకార్తికేయన్‌తో కమల్ హాసన్ నిర్మిస్తోన్న చిత్ర టైటిల్ ఇదే.. ఫస్ట్ లుక్ అదిరింది మామా!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×