E-Paper
Advertisement

Devotees Alert: శ్రీశైలం నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలెర్ట్ – ఈ విషయాలు తెలియకుండా అస్సలు వెళ్ళకండి

Devotees Alert: శ్రీశైలం నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలెర్ట్ – ఈ విషయాలు తెలియకుండా అస్సలు వెళ్ళకండి
Advertisement

Devotees Alert: శివరాత్రికి శ్రీశైలం వెళ్తున్నారా..? నడక దారిలో ఆ ముక్కంటిని దర్శించుకోవాలి అనుకుంటున్నారా..?  అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే నడక మార్గంలో మీకు ఇబ్బందులు తప్పవు.

మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం నడక దారి భక్తుల కోసం కర్నూల్ నుంచి శ్రీశైలం వరకు ఫారెస్ట్‌ లో వెళ్లే భక్తుల కోసం ఫారెస్ట్ డిఫార్ట్‌మెంట్‌ కొన్ని షరతులు విధిస్తుంది. వాటితో పాటు నడక దారిలో వెళ్లే భక్తులు ఈ కింది విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే నడక మార్గంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement

మహా శివరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం (2026) ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అడవి మార్గంలో వెళ్లడానికి అటవీశాఖ అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ కింది విషయాలు తప్పకుండా పాటించాలని సూచించింది.

ప్లాస్టిక్‌, సిగరెట్‌, గుట్కా నిషేధం:

అడవి మార్గంలో వెళ్లే భక్తులు ముఖ్యంగా ప్లాస్టిక్‌ బ్యాగులు తీసుకెళ్లకపోవడం బెటర్‌. ఎందుకంటే అడవి మార్గంలో ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులపై అటవీశాఖ నిషేధం విధించింది. అలాగే సిగరెట్‌, పాన్‌, గుట్కా లను కూడా నిషేధించింది. అటవీ శాఖ అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేదంటే మీకు తగిన శిక్ష విధించేందుకు అటవీ అధికారులు రెడీగా ఉంటారు.

వెహికిల్స్‌ కు అనుమతి లేదు:

Advertisement

పలు ప్రాంతాల నుంచి నడక మార్గంలో వెళ్లాలనుకుని తమ సొంత వాహనాలలో నడకమార్గం దగ్గరకు వెళ్లిన వారు కేవలం వారి వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్న వెంకటాపురం చెక్‌పోస్ట్‌ వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఇక అందరూ నడుచుకుంటూ వెళ్లాల్సిందే.

డిజిటల్‌ పేమెంట్స్‌ పని చేయవు:

ఇక అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మెడిసిన్స్‌ ముందే మీ దగ్గర ఉంచుకోవాలి. అంటే ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్లు బెనకడం, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మెడిసిన్స్‌ మీ వెంటే ఉంచుకోవాలి. ఇక దారిలో ఫోన్‌ సిగ్నల్‌ ఉండదు కాబట్టి చిన్న అవసరాల కోసం చిల్లర డబ్బులు మీ జేబులో ఉండేటట్టు చూసుకోవాలి. అయా ప్రాంతాలలో డిజిటల్‌ పేమెంట్స్‌ పని చేయవు. అలాగే తగినన్ని వాటర్‌ మీతో ఉండేటట్టు చూసుకోండి. మధ్యలో అక్కడక్కడా వాటర్‌ అమ్ముతుంటారు. మీ బాటిల్స్‌లో అక్కడ వాటర్‌ నింపుకోవచ్చు.

అన్నదానం చేస్తుంటారు:

అటవీ మార్గంలో  కొన్ని చోట్ల అన్నదానం చేస్తుంటారు. భక్తులకు ఉచితంగా అక్కడ అన్నం దొరుకుంది. కాబట్టి భక్తులకు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్‌ అవసరం లేదు. అలాగే ప్రభుత్వం వారిచే ఉచిత వైద్యశిబిరాలు నడకమార్గంలో ఉంటాయి. అక్కడ డాక్టర్లు అత్యవసరమైన మెడిసిన్స్‌ అందుబాటులో ఉంటాయి.

 విశ్రాంతి ఏర్పాట్లు:

ఉదయం నడక మొదలుపెట్టిన వారు రాత్రి అయ్యే సరికి పెద్ద చెరువు వరకు చేరుకుంటారు. అలాంటి వారు పెద్ద చెరువు వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడ రెంట్‌ పర్పస్ లో చాపలు లభిస్తాయట. రాత్రి మొత్తం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయమే మళ్లీ నడక ప్రారంభిస్తే..చాలా రిలీఫ్‌గా ఉంటుంది.

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది నడక మార్గంలో వెళ్లాలి అనుకున్న వాళ్లు కొండలు, లోయల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకోసం మిమ్మల్ని మీరు పూర్తిగా శారీరకంగా, మానసికంగా సిద్దం చేసుకోవాలి. అలా నడవలేని వాళ్లు నడక మార్గంలో వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.

ALSO READ: తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ – రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×