E-Paper
Advertisement

Tharun Bhascker mother:భార్యకు భయపడకురా… ఈషా రెబ్బ విషయంలో తరుణ్ భాస్కర్‌కు తల్లి షాకింగ్ సజెషన్

Tharun Bhascker mother:భార్యకు భయపడకురా… ఈషా రెబ్బ విషయంలో తరుణ్ భాస్కర్‌కు తల్లి షాకింగ్ సజెషన్
Advertisement

Tharun Bhascker Mother: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్(Tharun Bhascker) త్వరలోనే ఓం శాంతి శాంతి శాంతి (Om Shanthi Shanthi Shanthi)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. A R సజీవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ జయా జయా జయా జయహే అనే సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జనవరి 30 వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

అదే పాత్రలో ఉండిపోకు రా ప్లీజ్ ..

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను తరుణ్ భాస్కర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్టర్లపై తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీత భాస్కర్ ఆసక్తికర కామెంట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టుపై తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్ కామెంట్ చేస్తూ.. ఒరేయ్ తరుణ్ భాస్కర్ ఆల్ ద బెస్ట్.. చేసినావు అయిపోయింది.. అదే పాత్రలో ఉండిపోకు రా ప్లీజ్ అంటూ ఈమె కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఈయన భార్యకు భయపడే భర్త పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.

ఈషా రెబ్బా ప్రేమలో తరుణ్ భాస్కర్..

Advertisement

ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ తల్లి స్పందిస్తూ అలాగే భార్యకు భయపడుతూ ఉండిపోకుండా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయ్ అంటూ సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఈశా రెబ్బ నటించిన సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి జంటగా కనిపించడం, ఒకే చోట పండుగలు జరుపుకోవడం వంటివి చూస్తుంటే వీరి గురించి వచ్చే వార్తలు నిజమేనని తెలుస్తోంది.

Advertisement

ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడమే కాకుండా త్వరలోనే వీరి రిలేషన్ గురించి అధికారికంగా తెలియజేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈషా రెబ్బాను తరుణ్ భాస్కర్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో గీత భాస్కర్ తన కొడుకుకు ఇలాంటి సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక గీత భాస్కర్ సైతం పలు సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు ఈమె ఫిదా సినిమాలో సాయి పల్లవి అత్త పాత్రలో నటించారు. ఉప్పెన, సీతారామం వంటి సినిమాలలో గీత భాస్కర్ నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Balakrishna: నా పరువు నిలబెట్టావు… శర్వాను మెచ్చుకున్న బాలయ్య

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×