E-Paper
Advertisement

Actor Madhvan: మహేష్ వారణాసి సినిమాలో మాధవన్.. తన పాత్ర రివీల్ చేసిన హీరో?

Actor Madhvan: మహేష్ వారణాసి సినిమాలో మాధవన్.. తన పాత్ర రివీల్ చేసిన హీరో?
Advertisement

Actor Madhvan:  సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు మాధవన్ (Madhvan)ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సౌత్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. త్వరలోనే మాధవన్ నటించిన దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ రాజమౌళి వారణాసి (Varanasi)సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మాధవన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. వారణాసి కోసం రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారని ఈ సినిమాలో మైథాలజీ నేపథ్యంలో రామాయణం భాగాన్ని చాలా వివరంగా చూపించబోతున్నారని తెలిపారు .అదే  విధంగా వారణాసి సినిమాలో నా పాత్ర చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తెరపై నా పాత్ర చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అంటూ ఈయన ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని లీక్ చేశారు .

హనుమంతుడి పాత్రలో మాధవన్?

Advertisement

వారణాసి సినిమాలో మాధవన్ నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు రాజమౌళి మాత్రం ఈయన పాత్రను అధికారకంగా వెల్లడించలేదు. అయితే తాజాగా మాధవన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేయడమేకాకుండా తన పాత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం మాధవన్ వారణాసి సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

రాముడిగా మహేష్ బాబు..

Advertisement

వారణాసి సినిమాలో మైథాలజీ నేపథ్యంలో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ ఉండబోతున్న నేపథ్యంలో ఇందులో రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారు. హనుమంతుడి పాత్ర కోసం మాధవన్  ను రాజమౌళి ఎంపిక చేశారని తెలుస్తోంది. తాజాగా మాధవన్ చేసిన ఈ కామెంట్స్ ద్వారా ఈయన ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి తదితరులు నటించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Rashmika Mandanna: విజయ్ నా భర్త.. వర్ణించడానికి మాటలు లేవు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×