
Vijay - Rashmika Wedding ( Source / Instagram )
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇవాళ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి ఫోటోలు బయటకొచ్చేసాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
పంచకట్టులో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ శారీలో రష్మిక మందన్న చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ క్యూట్ కపుల్ పెళ్లిలో చేసిన సందడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే హాజరయ్యారు. మార్చి 4 న సినీ తారలకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చెయ్యనున్నట్లు తెలుస్తుంది.

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
ఆ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా హాజరు కానున్నారని సమాచారం.. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో పాటు నటించిన హీరోయిన్లకు హీరోలకు, అలాగే రష్మిక మందన్న నటించిన స్టార్స్ అందరికీ కూడా రిసెప్షన్ ఇన్విటేషన్స్ అందినట్లు తెలుస్తుంది..

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
గత కొద్ది రోజులుగా వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని కూడా ఎక్కడ బయట పెట్టకుండా జాగ్రత్తపడ్డారు.. మొత్తానికి ఇవాళ మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టారు..

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. బ్యూటిఫుల్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి పెళ్లి బట్టల్లో ఈ జంట ఎంత అందంగా ఉన్నారో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి..

Vijay - Rashmika Wedding ( Source / Instagram )
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఫ్యామిలీ స్టార్ మూవీతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు..

Vijay - Rashmika Wedding photo Gallery
రష్మిక మందన్న విషయానికొస్తే.. నేషనల్ క్రష్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలల్లో నటిస్తుంది.. గత ఏడాది గర్ల్ ఫ్రెండ్, థామా చిత్రంలో నటించింది.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.