E-Paper
Advertisement

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు . ప్రస్తుతం ఈయన ది ప్యారడైజ్(The Paradise) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నాని ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా పనులలో బిజీగా ఉంటూనే నాని తన ఫ్యామిలీకి కావాల్సిన టైం కేటాయిస్తూ తన కుటుంబ సభ్యులతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

కొడుకుతో కుస్తీ పడుతున్న నాని..

తాజాగా నాని జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈయన జిమ్ లో తన కొడుకు అర్జున్(Arjun) తో కుస్తీ పడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేసిన నాని మై లిటిల్ ప్యారడైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అదేవిధంగా అర్జున్ గీసిన బొమ్మలను కూడా ఈయన షేర్ చేశారు. ఇందులో భాగంగా నాని జడల్ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇట్స్ జడల్ మంత్…

Advertisement

ఇలా తన కొడుకుతో కలిసి సెప్టెంబర్ నెలను ప్రారంభించాను అంటూ నాని చెప్పడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అఫీషియల్ టు జడల్ మంత్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జడల్ వర్సెస్ చోటా జడల్ అంటూ నాని,తన కొడుకును ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన నాని అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాని ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదలవుతుందని నిర్మాతలు తెలిపారు కానీ షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఆగస్టు 21వ తేదీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ తేదీ నుంచి కూడా మళ్లీ వాయిదా పడుతూ సెప్టెంబర్ 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ భారీ అంచనాలను పెంచేసాయి తాజాగా సెకండ్ సింగిల్ ఏష నాగుల సాంగ్ విడుదల చేయగా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాలో నాని జోడిగా ఖయాదు లోహర్ నటించగా స్పెషల్ సాంగ్ లో మాత్రం నాని జోడిగా కీర్తి సురేష్ సందడి చేశారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Also Read: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×