E-Paper
Advertisement

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్
Advertisement

Survival Thriller: సముద్రంలో ఓ కుటుంబం… చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లే… కానీ ఒక్కసారిగా సముద్రం మొత్తం మాయమైపోయి ఎడారిగా మారితే ? నీళ్లలో ఉండాల్సిన భయంకరమైన జీవులు నేలపైకి వచ్చి మనుషుల కోసం వేట మొదలుపెడితే ? తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పరుగెత్తాల్సి వస్తే ? ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ ‘Survive’. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. భూమి ధృవాల్లో సంభవించిన ఓ విపరీతమైన మార్పు కారణంగా సముద్రాల్లోని నీరు మొత్తం వెనక్కి వెళ్లిపోవడంతో, సముద్రపు అడుగు భాగం ఒక్కసారిగా ఎడారిగా మారుతుంది. అదే సమయంలో అగాధాల్లో దాక్కున్న ఆకలితో ఉన్న జీవులు బయటకు రావడంతో ఓ కుటుంబం ప్రాణాల కోసం పోరాటం మొదలవుతుంది. మరి అసలు సముద్రం ఎందుకు మాయమైంది ? ఆ జీవులు ఎక్కడి నుంచి వచ్చాయి ? పిల్లలను కాపాడుకోవడానికి జూలియా ఏం చేసింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

జూలియా తన భర్త టామ్, పిల్లలు క్యాసీ, బెన్‌తో కలిసి సముద్రంలో బోట్‌పై కొడుకు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. కుటుంబం మొత్తం సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ తుఫాను విరుచుకుపడుతుంది. బోట్ దాదాపు బోల్తా పడే పరిస్థితి వస్తుంది. కానీ తుఫాను కంటే పెద్ద ప్రమాదం వాళ్ల కోసం ఎదురు చూస్తుంటుంది.

Advertisement

తుఫాను తర్వాత కళ్లు తెరిచిన కుటుంబానికి కనిపించే దృశ్యం చూస్తే షాక్ అవ్వాల్సిందే. చుట్టూ సముద్రం లేదు. వాళ్ల బోట్ నీటిలో కాకుండా ఎండిపోయిన సముద్రపు అడుగు భాగంలో చిక్కుకుని ఉంటుంది. భూమి ధృవాల్లో జరిగిన మార్పు కారణంగా సముద్రాల్లోని నీరు వెనక్కి వెళ్లిపోవడంతో ప్రపంచం మొత్తం ఊహించని పరిస్థితిలోకి వెళ్లిపోయిందని వారికి అర్థమవుతుంది.

అయితే అసలు భయం అప్పుడే మొదలవుతుంది. సముద్రం అడుగున ఇన్నాళ్లు దాక్కున్న ఆకలితో ఉన్న జీవులు బయటకు వచ్చి మనుషుల కోసం వేట మొదలు పెడతాయి. భర్తను కోల్పోయిన తర్వాత జూలియానే పిల్లల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. నీరు తిరిగి వచ్చేలోపు సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలి. అదే సమయంలో అగాధపు జీవుల నుంచి తప్పించుకోవాలి. ప్రతి అడుగు ప్రమాదమే. అసలు ఈ జీవులు ఏంటి ? నీరు తిరిగి వస్తే పరిస్థితి ఎలా మారుతుంది ? జూలియా తన పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లగలదా ? సముద్రం మళ్లీ నిండేలోపు వాళ్లు ఆ నరకం నుంచి బయటపడతారా ? అనేదే ఈ సినిమాలో చూడాల్సిన అసలు సర్వైవల్ థ్రిల్.

తెలుగులో ఏ ఓటీటీలో ఉంది ?

Advertisement

ఫ్రెడెరిక్ జార్డిన్ దర్శకత్వం వహించిన ‘సర్వైవ్’లో ఎమిలీ డిక్వెన్, ఆండ్రియాస్ పీట్ష్‌మాన్, లిసా డెలమార్, లూకాస్ ఎబెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 89 నిమిషాలు. యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. Prime Videoలో కూడా లిస్టింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా Apple TVలో హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ఆడియన్స్‌కు కూడా ఈ సర్వైవల్ థ్రిల్లర్ అందుబాటులోనే ఉంది. సముద్రం, సైన్స్ ఫిక్షన్, మాన్‌స్టర్స్, సర్వైవల్, కుటుంబం కోసం ప్రాణాలకు తెగించే కథలు ఇష్టపడేవారికి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో వచ్చిన మూవీ మంచి థ్రిల్లింగ్ సినిమా అవుతుంది.

Read Also: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×