Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఎన్నో రియాలిటీ షోలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ సీజన్లోకి అడుగు పెట్టబోతున్నారు. మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ 10 కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్టు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోయే ఫైనల్ కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 6 వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లో ఎవరు అనే విషయానికి వస్తే.. చెన్నై లవ్ స్టోరీ సినిమా సెకండ్ హీరో అజిత్ ఈశ్వరన్ , రోహిత్, వినాయకుడు మూవీ హీరో కృష్ణుడు, శాలిని, గుప్పెడంత మనసు సీరియల్ నటుడు ముఖేష్ గౌడ్, జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం,R.J చరణ్, వర్షిని సౌందర్య రాజన్, సింగర్ ఝాన్సీ, డెబ్జానీ, చైత్ర రాయ్ , నవరసాల ఆర్కే, సుధీర్ రెడ్డి ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కామనర్స్ కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసి హౌస్ లోకి పంపించారు. అదేవిధంగా కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విజేతగా నిలిచారు. ఇక ఈ సీజన్ లో కూడా అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసి హౌస్ లోకి పంపించబోతున్నారు . ఈ సీజన్ లో ఆరుగురు కామనర్స్ కంటెస్టెంట్లుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి లాంచింగ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెర నటీనటులతో పాటు కమెడియన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఆరో తేదీ ఎంతో ఎంతో అంగరంగ వైభవంగా ప్రసారం కానుంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నవాళ్లే హౌస్ లోకి అడుగు పెడతారా, లేదంటే ఊహించని విధంగా కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తారా అనేది తెలియాల్సింది. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా కింగ్ నాగార్జున(Nagarjuna) వ్యవహరించబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే .
Also Read: యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?