E-Paper
Advertisement

Pawan Kalyan: ఒక్క నిర్ణయంతో కోట్ల ప్రాజెక్ట్ వదులుకున్న పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Pawan Kalyan: ఒక్క నిర్ణయంతో కోట్ల ప్రాజెక్ట్ వదులుకున్న పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
Advertisement

Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు. చిరంజీవి తమ్ముడిగానే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన టాలెంట్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈయనకున్నంత క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరోకి లేదని చెప్పాలి. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాలకు కాస్త దూరమవుతూ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ కు దూరంగా పవన్..

పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఇక పాలిటిక్స్ లోకి రావడంతో ఈయన పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలు మాత్రమే చేస్తారు కానీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ కు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ చేనేత పరిశ్రమ, జీవన్ దాన్ అవయవ దాన వంటి వాటిని ప్రమోట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించారు. ఇక సినిమాలలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన పెప్సీ కూల్ డ్రింక్ కు బ్రాండ్ ఎండార్స్మెంట్ చేశారు.

రూ.40 కోట్లు రిజెక్ట్ చేసిన పవన్..

Advertisement

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారు అయితే ఈయన సినిమాలలోను రాజకీయాలలోను సక్సెస్ అయిన తర్వాత ప్రముఖ టొబాకో కంపెనీ తమ బ్రాండ్ ప్రమోట్ చేయాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారని తెలుస్తోంది. తమ టొబాకో బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేశారట. టొబాకో ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. అంతే కాకుండ పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మార్చిలోనే ఉస్తాద్ భగత్ సింగ్..

Advertisement

ఈ విధంగా పవన్ కళ్యాణ్ 40 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సింపుల్ గా నో చెప్పడంతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మార్చ్ లో విడుదల అవ్వాల్సిన రామ్ చరణ్ నాని సినిమాలు వాయిదా పడటంతో మార్చి నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది.

Also Read: Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల .. ఇలాంటి పాత్రలకే పరిమితమా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×