E-Paper
Advertisement

BCCI: తాను తీసుకున్న గోతిలో తానే పడింది…బంగ్లాదేశ్ తో ఆడే ఆ రెండు సిరీస్ లు ర‌ద్దు

BCCI: తాను తీసుకున్న గోతిలో తానే పడింది…బంగ్లాదేశ్ తో ఆడే ఆ రెండు సిరీస్ లు ర‌ద్దు

BCCI:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board). టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరగనుంది. అయితే సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) ఊహించని షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ తో త్వరలో జరగబోయే టి20 లు అలాగే వన్డేలు ఆడబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైదొలిగిన బంగ్లాదేశ్ కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టి20 తో పాటు వన్డే సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు, మూడు టి20 లు జరగనున్నాయి. వాస్తవంగా ఈ టోర్నమెంట్ 2025 ఆగస్టు సమయానికి జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది. అయితే, ఈ రెండు టోర్నమెంట్ల పైన తాజాగా బీసీసీఐ ( Board of Control for Cricket in India) ఓ నిర్ణయానికి వచ్చింది.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం కారణంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుందట. సెప్టెంబర్ లో జరగాల్సిన మూడు టి20 లు, మూడు వన్డేల సిరీస్ ను రద్దు చేసుకుందట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా బీసీసీఐ చేయబోతుందట. ఇదే జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు మరో షాక్ తగిలి ఛాన్స్ ఉంది. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ కు 240 కోట్ల నష్టం వాటిల్లి ప్రమాదం ఉందని ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు బీసీసీఐ కూడా చి కొడితే… బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అడుక్కు తినడమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్.

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ( Bangladesh Team) త‌ప్పుకోవ‌డంతో ఐసీసీ (ICC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ ను తీసుకోనుంద‌ట‌. ర్యాంకింగ్స్ ప్ర‌కారం, స్కాట్లాండ్ అర్హ‌త సాధించింద‌ట‌. అటు పాకిస్తాన్ జ‌ట్టు కూడా బైకాట్ చేసే ఛాన్స్ ఉంద‌ట‌.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×