E-Paper
Advertisement

Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల .. ఇలాంటి పాత్రలకే పరిమితమా?

Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల .. ఇలాంటి పాత్రలకే పరిమితమా?
Advertisement

Sreeleela: పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల(Sreeleela) మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా ధమాకాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా ఏ సినిమా కూడా ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. ఇక ఇటీవల రవితేజతో మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా తెలుగులో వర్కౌట్ కాకపోవడంతో ఈమె పరాశక్తి సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుధా కొంగరదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఇక పరాశక్తి సినిమా తర్వాత శ్రీ లీలకు తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది.

అజిత్ సినిమాలో శ్రీ లీల..

శ్రీ లీల మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అయితే ఏకంగా సీనియర్ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar)సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అజిత్ కుమార్ ప్రస్తుతం అధిక రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. AK 64 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారం నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతుందని సమాచారం.

అజిత్ సినిమాలో మోహన్ లాల్..

Advertisement

ఇక ఈ సినిమాలో నటి శ్రీ లీల కూడా కనిపించబోతున్నారని ఈమె హీరోయిన్ గా కాకుండా, కీలక పాత్రలో కనిపించబోతున్నట్ల సమాచారం. ఇక ఈ సినిమాలో శ్రీ లీలతో పాటు మలయాళం స్టార్ హీరో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్(Mohan Lal) కూడా కీలక పాత్రలో సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీ లీల హీరోయిన్ గా కీలక పాత్రలో నటించబోతున్నారనే విషయం తెలియడంతో ఈమెకు వరుస ప్లాప్ సినిమాలు వెంటాడుతున్న నేపథ్యంలో హీరోయిన్లుగా అవకాశాలు రావడం లేదని సీనియర్ హీరోల సినిమాలలో హీరోల కూతురి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి అజిత్ సినిమాలో శ్రీ లీల పాత్ర ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.

అజిత్ ను కలిసిన శ్రీలీల…

Advertisement

ఇలా శ్రీలీల ఈ సినిమాలో నటించబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారక సమాచారం వెలబడలేదు కానీ ఇటీవల ఈమె మలేషియాలో అజిత్ రేసిక్ ఈవెంట్ లో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: King film Release Date: క్రిస్మస్ ను టార్గెట్ చేసిన షారుఖ్ ఖాన్ ‘ కింగ్’..రిలీజ్ డేట్ ఫిక్స్!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×