E-Paper
Advertisement

Rajeev kanakala : ప్రభాస్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన రాజీవ్.. నిజంగా మహారాజువే సామి..

Rajeev kanakala : ప్రభాస్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన రాజీవ్.. నిజంగా మహారాజువే సామి..
Advertisement

Rajeev kanakala : సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలలో సై సినిమా జనాలని ఎమోషనల్ గా కట్టిపడేసింది. ఇప్పుడు ఈయన సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో తన భార్య యాంకర్ సుమతో కలిసి సందడి చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే సుమ ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. రాజీవ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో ప్రభాస్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. అసలేం చెప్పాడంటే..

ప్రభాస్ మనసు వెన్న.. గ్రేట్ అంతే..

నటుడు రాజీవ్ కనకాల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మాట్లాడారు.. ఆయన మనస్తత్వం ఎలాంటిదో వివరించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. మేము ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించాము. రాజమౌళి, రమా, రమా ప్రభా గారు, ప్రభాస్ ఆ హోమ్ కట్టించడానికి ముందుకు వచ్చారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ను కట్టించాము.. అంతటితో మా పని అయిపోయింది. ఆ తర్వాత మేమెవ్వరం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే.. ప్రభాస్ ఇప్పటికీ ఆ హోమ్ కి డబ్బులు పంపిస్తున్నాడు.. ఇలాంటి మంచి గుణం ఎంతమందికి ఉంటుంది అని రాజీవ్ కనకాల ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. మరొకరికి పెట్టడంలో మా ప్రభాస్ మహారాజు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రభాస్ సాయం చెయ్యడానికి ఎప్పుడు వెనకడుగు వెయ్యడు.. ఇప్పటికే ఆయన ఎంతోమందికి సాయమందించి రియల్ హీరో అయ్యాడు.

Advertisement

Also Read : ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ భారీ ధరకు ఓవర్సీస్ డీల్.. టార్గెట్ ఎంతంటే..?

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఈయన చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ఈమధ్య ప్రభాస్ నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. చిత్ర నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఎన్ని కోట్లైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటుగా డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజి సినిమాలో నటిస్తున్నారు.. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Advertisement

?igsh=azF3MGZ6cmxvandu

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×