E-Paper
Advertisement

Toyota Hilux 5 Stars: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన టయోటా హిలక్స్, ఏకంగా ఎన్ని పాయింట్స్ సాధించిందంటే..

Toyota Hilux 5 Stars: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన టయోటా హిలక్స్, ఏకంగా ఎన్ని పాయింట్స్ సాధించిందంటే..

New-Gen Toyota Hilux Crash Test: టయోటా కంపెనీ తాజాగా తయారు చేసిన న్యూ జెనరేషన్ హిలక్స్.. తాజాగా నిర్వహించిన  ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP) క్రాష్ టెస్ట్‌ లో కంప్లీట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లో అమ్మకానికి వచ్చే అన్ని వేరియంట్లకు ఈ టెస్ట్ వర్తిస్తుందని టయోటా కంపెనీ ప్రకటించింది.

క్రాష్ట్ టెస్ట్ లో ఎన్ని పాయింట్స్ సాధించిందంటే..   

⦿ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్: 33.96/40 పాయింట్లు (84%)

⦿ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్: 44.00/49 పాయింట్లు (89%)

⦿ వల్నరబుల్ రోడ్ యూజర్ ప్రొటెక్షన్: 52.16/63 పాయింట్లు (82%)

⦿ సేఫ్టీ అసిస్ట్ (ADAS ఫీచర్లు): 82%

ఫ్రంటల్ ఆఫ్‌ సెట్, సైడ్ ఇంపాక్ట్, పోల్ టెస్ట్‌ లలో క్యాబిన్ స్ట్రక్చర్ స్టేబుల్‌గా ఉండి, మంచి ప్రొటెక్షన్ చూపించింది. కొన్ని చిన్న లోపాలు ముఖ్యంగా డ్రైవర్ చెస్ట్‌ లో వీక్ ప్రొటెక్షన్, సెంటర్ ఎయిర్‌ బ్యాగ్ లేకపోవడం లాంటివి  ఉన్నప్పటికీ, మొత్తం ఎక్స్‌లెంట్ పెర్ఫార్మెన్స్ చూపించింది.

కీ సేఫ్టీ ఫీచర్లు

⦿ 7 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. కొన్ని వేరియెంట్లలో సెంటర్ ఎయిర్‌ బ్యాగ్ కూడా ఉంది.

⦿ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) పెడెస్ట్రియన్, జంక్షన్ డిటెక్షన్‌తో వస్తుంది.

⦿ లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది.

⦿ స్పీడ్ సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది.

⦿ టయోటా సేఫ్టీ సెన్స్ ప్యాకేజీతో వస్తుంది.

ఓల్డ్ జెనరేషన్ కు సంబంధించి 2019లో నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో అడల్ట్ ప్రొటెక్షన్ 96% ఉండగా, కొత్త ప్రోటోకాల్స్ స్ట్రింజెంట్ కావడంతో 84%కు వచ్చింది. ప్రస్తుతం టాప్ క్లాస్ సేఫ్టీని కలిగి ఉంది!

కొత్త తరం టయోటా హిలక్స్ గురించి..

టయోటా హిలక్స్ 9వ జెనరేషన్ నవంబర్ 2025లో థైలాండ్ మోటార్ ఎక్స్‌పోలో గ్లోబల్ డెబ్యూ చేసింది. ఇది మరింత మోడర్న్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వేరియంట్‌తో వచ్చింది. హిలక్స్ ఎప్పటి లాగే అన్‌బ్రేకబుల్ డ్యూరబిలిటీని కొనసాగిస్తూ, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ, సేఫ్టీని మరింత కనబరుస్తుంది.

డిజైన్,ఎక్స్‌ టీరియర్, ఇంటీరియర్,  ఫీచర్స్

బోల్డ్ మరియు అగ్రెసివ్ లుక్ ను కలిగి ఉంటుంది. వైడర్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, TOYOTA లెటరింగ్ ను కలిగి ఉంటుంది.  ప్రీమియం క్యాబిన్ తో వస్తుంది. ల్యాండ్ క్రూజర్ ఇన్‌ స్పైర్డ్ డ్యాష్‌ బోర్డ్, బ్లాక్ థీమ్ ను కలిగి ఉంటుంది. 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ తో వస్తుంది. కంఫర్ట్ విషయానికి వస్తే, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌ లెస్ ఛార్జర్, రియర్ USB పోర్ట్స్, డ్రైవ్ మోడ్స్తో వస్తుంది.

ఇంజన్,  పెర్ఫార్మెన్స్

⦿ డీజిల్: 2.8L టర్బో-డీజిల్ (201 PS, 500 Nm), 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్.

⦿ మైల్డ్-హైబ్రిడ్ (48V): ఎక్స్టా టార్క్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని కలిగి ఉంటుంది.

⦿ ఎలక్ట్రిక్ (BEV): డ్యూయల్ మోటార్ AWD, 300 km రేంజ్ తో వస్తుంది.

దేశీ మార్కెట్ లో లాంచ్, అంచనా ధర

భారత్ లో ప్రస్తుతం ఓల్డ్ మోడల్ అమ్మకంలో ఉంది. దీని ధర రూ. 30-37 లక్షలు ఉంటుంది. కొత్త తరం 2026 చివరలో లేదంటే 2027లో లాంచ్ అవుతుంది. దీని  అంచనా ధర రూ. 35-45 లక్షలు. ఈ వెహికిల్ ఇసుజు V క్రాస్, మహీంద్రా స్కార్పియో పికప్‌ తో పోటీ పడుతుంది.

Read Also: మారుతి సెలెరియో క్రాష్ టెస్ట్.. రిజల్ట్ చూస్తే షాక్!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×