E-Paper
Advertisement

MSVPG : ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ భారీ ధరకు ఓవర్సీస్ డీల్.. టార్గెట్ ఎంతంటే..?

MSVPG : ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ భారీ ధరకు ఓవర్సీస్ డీల్.. టార్గెట్ ఎంతంటే..?
Advertisement

MSVPG : టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది.. అనిల్ రావిపూడి సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ డీల్ కూడా పూర్తయినట్లు సోషల్ మీడియాలో వార్తలు.. అయితే ఎన్ని కోట్లకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడయ్యాయి.. అక్కడ టార్గెట్ ఎంత అనేది ఒకసారి తెలుసుకుందాం..

భారీ ధరకు చిరు సినిమా ఓవర్సీస్ డీల్..

చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలైపోతూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు చిరు.. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి కాంబోలో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను విక్రయించినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఈ సినిమాకు ఏకంగా రూ.20 కోట్ల మేర ఓవర్సీస్ డీల్ ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నార్త్ అమెరికాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది.. అలాగే మొత్తం ఓవర్సీస్ లో 4.75 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బరిలోకి దిగనుంది.. ఏ మాత్రం వసూళ్లను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read :భూషణ్ మాటలకు మహా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. నిజం చెప్పేసిన మహా..?

మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ స్టోరీ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.. హీరోయిన్ కేథరిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూస్తున్నాం.. రిలీజ్ అయిన రెండు పాటలు కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా మీసాల పిల్ల పాట ఎక్కడ చూసిన వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ పాటలపై రీల్స్ కూడా వస్తున్నాయి. పాటలతోనే సినిమాకు మంచి హైప్ నెలకొంది.. మరి సంక్రాంతి బరిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత చిరంజీవి మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమాల గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×