E-Paper
Advertisement

Tata Harrier Petrol: పెట్రోల్ వెర్షన్ లో టాటా హారియర్.. మైలేజ్ ఎంతో తెలుసా?

Tata Harrier Petrol:  పెట్రోల్ వెర్షన్ లో టాటా హారియర్.. మైలేజ్ ఎంతో తెలుసా?
Advertisement

Tata Harrier Petrol: వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన కార్లను తీసుకురావడంలో టాటా మోటార్స్ ముందుంటుంది. తమ కంపెనీ విడుదల చేసే కార్లు ప్రస్తుతం హైబ్రిడ్ వెర్షన్లలో అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా హారియర్ SUVకు పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు డీజిల్ వెర్షన్ లో మాత్రమే ఉన్న ఈ ఫ్లాగ్‌ షిప్ SUVకి కొత్త 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ (Hyperion TGDi) యాడ్ చేసింది. మరింత స్మూత్, లో సౌండ్ తో క్రేజీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌ కు బెస్ట్. కొత్త ఫీచర్లతో పాటు ధర కూడా డీజిల్ కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.

పెట్రోల్ వెర్షన్ ఇంజన్, పెర్ఫార్మెన్స్

హారియర్ SUV పెట్రోల్ వెర్షన్ ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ (Hyperion TGDi), 4-సిలిండర్ తో వస్తుంది. 168-170 PS పవర్ ను కలిగి ఉంటుంది. 280 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదంటే 6-స్పీడ్ ఆటోమేటిక్ (టార్క్ కన్వర్టర్) ట్రాన్స్‌ మిషన్ తో వస్తుంది. 14-16 kmpl వరకు మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అధికారిక ARAI ఫిగర్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్మూత్ రిఫైన్‌మెంట్, హైవే ఓవర్‌ టేకింగ్‌ కు మంచి రెస్పాన్స్ ఉంటుంది. డీజిల్ కంటే 80 kg తక్కువ బరువు కారణంగా మెరుగైన హ్యాండ్లింగ్ ఉంటుంది.

పెట్రోల్ వేరియంట్‌లో కొత్త ఫీచర్లు

Advertisement

హారియర్ SUV పెట్రోల్ టాప్ వేరియంట్ కొత్త Fearless Ultra ట్రిమ్ ఉంటుంది. రెడ్ డార్క్ ఎడిషన్ కూడా అందుబాటు ఉంది.  ఇన్ఫోటైన్‌మెంట్ 14.5 ఇంచ్ టచ్‌ స్క్రీన్ తో వస్తుంది. Dolby Atmos సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ IRVM (బిల్ట్ ఇన్ డ్యాష్‌క్యామ్, DVR), మెమరీ ORVMs విత్ ఆటో డిప్ ఫంక్షన్, అడ్వాన్స్‌డ్  లెవల్ 2 ADAS, 65W టైప్-C USB పోర్ట్స్, ఫ్రంట్, రియర్ కెమెరాలకు వాషర్ ఫంక్షన్, ఆస్టర్ వైట్, టైటాన్ బ్రౌన్ ఇంటీరియర్ థీమ్, ప్రీమియం లెదరెట్ అప్‌హోల్స్టరీ, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఇవి డీజిల్ మోడల్‌ లో ఉన్న పనోరమిక్ సన్‌ రూఫ్, 7 ఎయిర్‌ బ్యాగ్స్, 360° కెమెరా, వెంటిలేటెడ్ సీట్ల లాంటి ఫీచర్లతో వస్తుంది.

హారియర్ SUV వేరియంట్స్, ధర

హారియర్ SUV పెట్రోల్ వెర్షన్ స్మార్ట్, ప్యూర్ X, అడ్వెంచర్, ఫియర్‌ లెస్ X, డార్క్,  స్టెల్త్ ఎడిషన్స్ తో పాటు కొత్త ఫియర్‌లెస్ అల్ట్రా వేరియంట్స్ లో లభిస్తుంది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే, రూ. 14-15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు(ఎక్స్ షోరూమ్) ఉంటుంది. డీజిల్ కంటే రూ. 50,000-80,000 తక్కువకు లభిస్తుంది. అధికారిక ధరలు త్వరలో టాటా మోటార్స్ ప్రకటించే అవకాశం ఉంటుంది.

హారియర్ SUV డైమెన్షన్స్,  సేఫ్టీ

Advertisement

ఈ కారు 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. అడల్ట్,  చైల్డ్ సేఫ్టీలో టాప్ స్కోర్ ను సాధించింది. పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, 7 ఎయిర్‌బ్యాగ్స్, ESP లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.   ఈ పెట్రోల్ వేరియంట్ మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ లాంటి కార్లతో పోటీపడనుంది. మరింత రిఫైన్డ్ డ్రైవ్ కావాలనుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×