BigTV English

Raj Tarun:రాజ్ తరుణ్ ఏంటీ పనులు… జీవితంలో అలసిపోయావా ?

Raj Tarun:రాజ్ తరుణ్ ఏంటీ పనులు… జీవితంలో అలసిపోయావా ?

Raj Tarun:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మోస్తారు హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ (Raj Tarun) గత సంవత్సర కాలం నుండి మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. దానికి కారణం రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం.. రాజ్ తరుణ్ ఇండస్ట్రీ కి సంబంధంలేని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నట్టు ఆ అమ్మాయి చెబుతుంది. కానీ రాజ్ తరుణ్ కి, ఆ అమ్మాయికి పెళ్ళైనట్టు ఆధారాలు లేకపోవడంతో ఈ పెళ్లి చట్టబద్ధం కాదని.. ఇప్పటికే చాలామంది అన్నారు. అలాగే రాజ్ తరుణ్ , ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి ఓ విల్లా కొన్నారని, ఆ విల్లా గురించే ఆ అమ్మాయి గొడవ అంతా చేస్తుందని బయటికి వచ్చింది. దాంతో ఈ విల్లా ఇష్యూ కోర్టు దాకా వెళ్లడంతో కోర్టు.. ఆ అమ్మాయిని మందలించి ఈ విల్లా కొనడానికి నువ్వు డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవు కాబట్టి ఈ ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు.వెంటనే ఇంట్లో నుండి వెళ్లిపో అని కోర్టు క్లియర్ కట్ గా చెప్పింది. దాంతో ఆ అమ్మాయికి పెద్ద షాక్ తగిలింది.అయినా కూడా ఆ అమ్మాయి రాజ్ తరుణ్ ని వదిలిపెట్టడం లేదు.


నెట్టింట దుమారం రేపుతున్న రాజ్ తరుణ్ ప్రైవేట్ ఫోటో..

ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా రాజ్ తరుణ్ ఓ అమ్మాయితో ఉన్న ఒక ప్రైవేట్ ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి రాజ్ తరుణ్ ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే..రాజ్ తరుణ్ ఓ ప్రముఖ హీరోయిన్ తో సోఫాలో నిద్రపోతున్న ఫోటో నెట్టింట దుమారం సృష్టిస్తోంది. అయితే ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఫేస్ క్లియర్ కట్ గా కనిపించకపోయినప్పటికీ.. ఈ ఫోటో వెనుక చాలానే అర్థం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.


జీవిత ప్రయాణంలో అలసిపోయావా?

రాజ్ తరుణ్ గత కొద్ది రోజుల నుండి పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం రాజ్ తరుణ్ కి ఓ హీరోయిన్ తో మనశ్శాంతి దొరికింది. అందుకే ప్రశాంతంగా హీరోయిన్ తో కలిసి సోఫాలో నిద్రపోతున్నాడు. ప్రస్తుతం తన లైఫ్ లో ఉన్న బాధలన్నీ తొలగిపోయాయి కావచ్చు.అందుకే సాఫీగా ఆ హీరోయిన్ తో కలిసి సోఫాలో పడుకున్నాడు అని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమందేమో జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయిన రాజ్ తరుణ్ హీరోయిన్ తో కలిసి మనశ్శాంతిగా పడుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

దేనికీ భయపడను అంటున్న రాజ్ తరుణ్

ఇక రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి రాజ్ పై ఎన్నో ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ కి చాలామంది హీరోయిన్లతో, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది.అంతేకాదు కొంతమంది హీరోయిన్లతో రాజ్ తరుణ్ ఉన్న ప్రైవేట్ ఫోటోలను కూడా మీడియాకి లీక్ చేసింది. అయితే రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని బ్యాడ్ చేయడానికి ఆమె చేయాల్సిన పనులన్నీ చేసింది.కానీ ఎక్కడా కూడా రాజ్ తరుణ్ భయపడలేదు. అలాగే తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన పనిలేదు.దీనికి ఉదాహరణగా ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోయిన్ తో పడుకున్న ఫోటో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీడియాకి లీక్ అయితే అది పెద్ద రచ్చ అవుతుంది అనే విషయం రాజ్ తరుణ్ కి కూడా తెలుసు.కానీ ఫోటో లీకైన సరే ఏం భయం లేదు అన్నట్లుగా ఆమెతో సోఫాలో పడుకొని అలాంటి ఫోజు ఇవ్వడంతో ఈ ఫోటో కాస్త నెట్టింట దుమారం సృష్టిస్తోంది. ఇక లీకైన ఈ ఫోటోలో రాజ్ తరుణ్ పక్కనే ఉన్న ఆ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది.

ALSO READ:Kiara – Siddharth: “నో ఫోటో పాలసీ” జాబితాలోకి కియారా దంపతులు.. గోప్యతను కాపాడండి అంటూ!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×