BigTV English

Sai Pallavi: అందుకే సీతగా సాయి పల్లవి.. ఆ లక్షణం ఉన్న ఏకైక హీరోయిన్

Sai Pallavi: అందుకే సీతగా సాయి పల్లవి.. ఆ లక్షణం ఉన్న ఏకైక హీరోయిన్

Sai Pallavi: ప్రేమమ్(Premam) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సాయి పల్లవి(Sai Pallavi). మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె అనంతరం ఫిదా సినిమా ద్వారా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సాయి పల్లవి తెలుగు, తమిళ, భాషలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ(Ramayana) సినిమాలో సీతపాత్రలో(Sita Role) సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.


గ్లామర్ షో లేదు… సర్జరీలు లేవు..

నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న రామాయణ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని మొదటి భాగం ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవిని సీత పాత్రలో ఎంపిక చేయడానికి గల కారణాలను చిత్ర బృందం వెల్లడించారు. సాయి పల్లవి ఇతర హీరోయిన్ల మాదిరిగా ఎక్కడ కూడా గ్లామర్ షో చేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఆమె ఇప్పటివరకు ఎలాంటి సర్జరీలను కూడా చేయించుకోకుండా చాలా సహజంగా కనిపిస్తారు.


సాయి పల్లవి సహజ అందం..

సాయి పల్లవి సహజ అందమే సీత పాత్రకు కరెక్టుగా సరిపోతుందన్న ఉద్దేశంతోనే తనని సీత పాత్రకు ఎంపిక చేసామని తెలియజేశారు. సీత పాత్ర కోసం చాలామందిని అనుకున్నప్పటికీ ఫైనల్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసామని తెలిపారు. ఈ సినిమా ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని రాకింగ్ స్టార్ యష్(Yash) నిర్మాణ సంస్థ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవిని సీతగా ఎంపిక చేసిన సమయంలో ఈమె పట్ల పలు విమర్శలు కూడా వచ్చాయి. తన నటనతో సీత పాత్రకు పూర్తిస్థాయిలో సాయి పల్లవి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే తీసుకొని ఉంటారంటూ మరికొంతమంది మద్దతుగా నిలిచారు. చివరికి సాయి పల్లవి ఎంపిక చేయడం వెనక గల కారణాన్ని కూడా చిత్ర బృంద తెలియజేశారు.

రావణాసురుడిగా యష్..

సాయి పల్లవి ఇటీవల అమరన్, తండేల్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె కథ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో అయినా కూడా ఆ సినిమాను సున్నితంగా తీరస్కరిస్తూ ఉంటారు. అలాగే గ్లామర్ షోలలో నటించడానికి కూడా సాయి పల్లవి ఇష్టపడరనే విషయం మనకు తెలిసిందే. ఇలా గ్లామర్ షో చేయకపోయినా ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక రామాయణ సినిమాలో కన్నడ స్టార్ యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Also Read: Sreeleela: పెళ్లిపై బిగ్ అప్డేట్ ఇచ్చిన శ్రీ లీల.. అప్పటివరకు నో ఛాన్స్ అంటూ?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×