BigTV English

Special Ops 2 Review : ‘స్పెషల్ ఆప్స్ 2’ వెబ్ సిరీస్ రివ్యూ… ఒళ్ళు జలదరించే యుద్ధం ఇది

Special Ops 2 Review : ‘స్పెషల్ ఆప్స్ 2’ వెబ్ సిరీస్ రివ్యూ… ఒళ్ళు జలదరించే యుద్ధం ఇది

రివ్యూ : ‘స్పెషల్ ఆప్స్ 2’ వెబ్ సిరీస్ రివ్యూ
ప్లాట్‌ఫాం: JioHotstar (హిందీ, తెలుగు, తమిళం డబ్బింగ్‌ అందుబాటులో)
నటీనటులు : కే కే మీనన్, తాహిర్ రాజ్ భసిన్, కరణ్ టాకర్, సాయామీ ఖేర్, ముజమ్మిల్ ఇబ్రహీం, ప్రకాశ్ రాజ్, వినయ్ పాఠక్ తదితరులు
దర్శకత్వం: నీరజ్ పాండే, శివం నాయర్
నిర్మాత: షితల్ భాటియా (Friday Storytellers)
ఎపిసోడ్‌లు: 7 ( ఒక్కో ఎపిసోడ్ 40-50 నిమిషాలు)


‘స్పెషల్ ఆప్స్ 2’ నీరజ్ పాండే హిట్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌కి మూడవ ఇన్‌స్టాల్‌మెంట్. 2020లో ‘స్పెషల్ ఆప్స్’ మొదటి సీజన్ రిలీజ్ అయింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ‘స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’ పేరుతో 2021లో సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మూడవ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి, RAW అధికారి హిమ్మత్ సింగ్ (కే కే మీనన్) సైబర్ యుద్ధంలో కొత్త డిజిటల్ శత్రువును ఎదుర్కొంటాడు. మరి ముఖం లేని శత్రువుతో ఈ ఆఫీసర్ పోరాటం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ
కథ బుడాపెస్ట్‌లో జరిగే AI సమ్మిట్‌తో మొదలవుతుంది. ఇక్కడ భారత ప్రభుత్వ టెక్ సిస్టమ్స్ డిజైనర్ డాక్టర్ పియూష్ భార్గవ (అరిఫ్ జకారియా) కిడ్నాప్ అవుతాడు. అదే సమయంలో ఢిల్లీలో RAW ఏజెంట్ వినోద్ శేఖావత్ హత్యకు గురవుతాడు. ఈ డబుల్ షాక్ నుంచి తేరుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన హిమ్మత్ బృందాన్ని… ఇదే కేసు హంగరీ, జార్జియా, బుల్గేరియా, డొమినికా, గ్రీస్ వంటి అంతర్జాతీయ లొకేషన్స్‌కు తీసుకెళ్తుంది. విలన్ సుధీర్ (తాహిర్ రాజ్ భసిన్) ఏఐ అండ్ సైబర్ వార్‌ఫేర్ నిపుణుడు.


భారత డిజిటల్ ఎకానమీని (UPI వంటివి) ధ్వంసం చేయడానికి కుట్రలు పన్నుతాడు. హిమ్మత్ తన టీమ్‌ ఫరూక్ అలీ (కరణ్ టాకర్), జూహీ కశ్యప్ (సాయామీ ఖేర్), అవినాష్ (ముజమ్మిల్ ఇబ్రహీం), రుహానీ (షిఖా తల్సానియా)తో కలిసి సుధీర్ ను ఆపడానికి ట్రై చేస్తాడు. అదే సమయంలో, అతని మాజీ ట్రైనర్ సుబ్రమణ్యం (ప్రకాశ్ రాజ్), ఫ్యామిలీ (గౌతమీ కపూర్, రేవతి పిళ్లై)కి సంబంధించిన సంఘటనలు అతన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ గ్లోబల్ కాన్స్‌పిరసీని హిమ్మత్ ఆపగలడా? ఈ సైబర్ యుద్ధంలో గెలిచింది ఎవరు ? అనేది స్టోరీ.

విశ్లేషణ
గ్లోబల్ లొకేషన్స్ మధ్య ర్యాపిడ్ షిఫ్టింగ్ వల్ల నేరేటివ్ క్లారిటీ తగ్గింది. ఎవరు ఎక్కడున్నారు, ఎందుకు? అని కొంత కన్‌ఫ్యూజన్ గా అన్పిస్తుంది. సుబ్రమణ్యం (ప్రకాశ్ రాజ్) సబ్‌ప్లాట్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగ ఎమోషనల్ సీన్స్ లో ఎఫెక్ట్ తగ్గి, ప్రకాశ్ రాజ్ ట్రాక్ అవసరమా బ్రో అనే విసుగు కన్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్స్ ప్రిడిక్టబుల్ గా ఉండడం నిరాశ పరుస్తుంది. హిమ్మత్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్ ను డిస్ట్రాక్ట్ చేసింది. స్పై థ్రిల్లర్‌లో ఫ్యామిలీ డ్రామా ఎందుకో ?

కే కే మీనన్ హిమ్మత్ సింగ్‌గా తన పర్ఫార్మెన్స్ తో దుమ్మురేపాడు. అతని ఐకానిక్ డైలాగ్ “యే సబ్ ముఝే కల్ బతానా” వినగానే స్మైల్ గ్యారంటీ. విలన్ సుధీర్‌గా తాహిర్ షో స్టీలర్. ప్రశాంతంగా ఉండే క్లాసికల్ మ్యూజిక్ లవర్‌గా కనిపిస్తూ, కాస్టిక్ కుట్రలు పన్నే విలన్‌గా అదుర్స్. ఏఐ, సైబర్, UPI డేటా బ్రీచ్ వంటి ఆధునిక థీమ్స్ సూపర్ రెలెవెంట్ గా ఉన్నాయి. ఈ సిరీస్ లో ఏఐ వల్ల జరిగే అనర్థాలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. హంగరీ, జార్జియా, బుల్గేరియా, డొమినికా వంటి గ్లోబల్ లొకేషన్స్ విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

7 ఎపిసోడ్‌లలో ఆల్మోస్ట్ ఒక్క నిమిషం కూడా డల్ మూమెంట్ లేదు. యాక్షన్ సీన్స్, డబుల్ క్రాసెస్, స్పై మిషన్స్ ఫుల్ థ్రిల్. అద్వైత్ నెమ్లేకర్ బీజీఎమ్ సాలిడ్ గా ఉంది. టెన్షన్ సీన్స్‌లో గూస్‌బంప్స్ గ్యారంటీ. కరణ్ టాకర్ (ఫరూక్), సాయామీ ఖేర్ (జూహీ), షిఖా తల్సానియా (రుహానీ) తమ పాత్రల్లో అదరగొట్టారు. రుహానీ హైదరాబాదీ హౌస్‌వైఫ్ కామెడీ మంచి రిలీఫ్ ఇస్తుంది.

ప్లస్ పాయింట్స్
నటీనటులు
టైమ్‌లీ థీమ్
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్
ప్రిడిక్టబుల్ ట్విస్ట్స్
ఓవర్‌లోడెడ్ ఫ్యామిలీ డ్రామా

మొత్తానికి
సీజన్ 1, 1.5 ఇంటెన్సిటీతో పోలిస్తే, సీజన్ 2 కొంత ల్యాగ్ అనిపిస్తుంది. సీజన్ 1 లెవెల్ రీచ్ కాలేదు. కానీ ఈ పోలికలేవి లేకుండా చూస్తే ఈ వీకెండ్ కు కిరాక్ సిరీస్ సెట్టు.

Special Ops 2 Rating : 2.75/5

Related News

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×