Kiara – Siddharth:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న కియారా అద్వానీ (Kiara advani) తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా విజయం సాధించింది..అదే క్రేజ్ తో రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసింది కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంట ఇటీవలే పండంటి బిడ్డకి జన్మనిచ్చారు కూడా.
గోప్యత కోరుకుంటున్న జంట..
అయితే తమ పాప విషయంలో కియారా దంపతులు మీడియాకు, అభిమానులకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. దయచేసి ఫోటోలు తీయద్దండి.. మీ దీవెనలే మా పాపకు శ్రీరామరక్ష అంటూ ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. “మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. తల్లిదండ్రులుగా మేము మొదటి అడుగులు వేస్తున్నాము. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో గోప్యతను పాటించాలని కోరుకుంటున్నాం. అందుకే ఫోటోలు పంచుకోవడం లేదు. మీరు కూడా దయచేసి మా పాప ఫోటోలను తీయకండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు అంటూ ఒక నోట్ రాసుకోచ్చారు ఈ జంట. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘నో ఫోటో పాలసీ’ ఫాలో అవుతున్న కియారా దంపతులు..
ఇది చూసిన చాలామంది ‘నో ఫోటో పాలసీ’ ని ఈ జంట కూడా ఫాలో అవుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో నో ఫోటో పాలసీ అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ తో పాటు దీపిక – రణ్వీర్ లు కూడా వారి పిల్లల ఫోటోలను తీయొద్దని పలుమార్లు చెప్పారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా తమ కూతురు క్లీం కారా జన్మించి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ పాప ఫోటో ని పూర్తిగా రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి కియార దంపతులు కూడా వచ్చి చేరారు. ఇకపోతే కియారా నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుండగా.. అటు సిద్ధార్థ్ పరమ్ సుందరి అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
ALSO READ:Prabhas: ప్రభాస్ ఇంట్లో స్పెషల్ చెట్టు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.?