E-Paper
Advertisement

Actor Rajasekhar: గోటీల ఫ్యాక్టరీ పై స్పందించిన రాజశేఖర్..ఆయన రియాక్షన్ ఇదే!

Actor Rajasekhar: గోటీల ఫ్యాక్టరీ పై స్పందించిన రాజశేఖర్..ఆయన రియాక్షన్ ఇదే!
Advertisement

Actor Rajasekhar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజశేఖర్ (Rajasekhar) ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన శర్వానంద్ (Sharwanand)హీరోగా నటించిన బైకర్ సినిమా (Biker Film)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బైకర్ సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ..

ముఖ్యంగా ఇటీవల ఇదేమిటమ్మా మాయ మాయ అనే పాట ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాట నటుడు రాజశేఖర్ సినిమా నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట ట్రెండింగ్ లో ఉండగా మీకేమనిపించిందనే ప్రశ్న ఎదురవడంతో చాలా హ్యాపీగా అనిపించిందని, ఈ పాట వైరల్ కావడంతో నేనే మరో సినిమాలో నటించి మంచి సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చిందని తెలిపారు. ఇలా ఇదేమిటమ్మ మాయ మాయ పాట సమయంలోనే మరోవైపు గోటీల (గోలీల) ఫ్యాక్టరీ (Gotila factory)కూడా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

గోటీల ఫ్యాక్టరీలో లక్షల్లో జీతం..

Advertisement

బైకర్ సినిమా ప్రపోషన్లలో పాల్గొన్న రాజశేఖర్ కు గోటిల ఫ్యాక్టరీ గురించి ప్రశ్న ఎదురైంది. గత కొద్దిరోజులుగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, ఎంతోమందికి రాజశేఖర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటూ వైరల్ అయిన వీడియో చూపించడంతో ఈ వీడియో పై రాజశేఖర్ స్పందించారు. అందరూ అనుకున్నట్టు నాకు గోటీల ఫ్యాక్టరీ లేదని, ఈ వీడియో వైరల్ గా మారడంతో తన స్నేహితులు కూడా తనకు ఫోన్ చేసి నిజంగానే ఫ్యాక్టరీ పెట్టావా అంటూ నన్ను అడిగారని తెలిపారు.

దయచేసి ఎవరు మోసపోవద్దు..

Advertisement

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మా ఫ్యామిలీ మొత్తం దీనిని చూసి నవ్వుకున్నామని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే గోటిల ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు అంటూ వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మి ఎవరు మోసపోవద్దు అంటూ ఈ సందర్భంగా అభిమానులను కూడా అప్రమత్తం చేశారు. ఇలా రాజశేఖర్ ఈ విషయంపై స్పందించడంతో ఈ వార్తలలో నిజం లేదని స్పష్టం అవుతుంది. ఇక బైకర్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని రాజశేఖర్ తెలిపారు. ఈ సినిమాలో రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యు .వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: Raashii Khanna: పొట్టి దుస్తుల పై రాశీ కన్నా కామెంట్స్.. డైరెక్టర్ ముందే చెప్పాడంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×