Road accident: వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు . బైక్ పై ప్రయాణిస్తున్న శ్రీపతి వంశీ, శ్రీపతి రాజు అనే ఇద్దరు యువకులను అతివేగంగా వచ్చిన టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి యువకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రాథమిక విచారణలో టాటా ఏసీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తేలింది. డ్రైవర్ అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందొచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.
Also Read: : పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!