Actor Shivaji Press Meet: హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ తను చేసిన కామెంట్స్కి క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. తను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టేనని, అదే సమయంలో తనకు రెండు అన్పార్లమెంటరీ పదాలు దొర్లయని, అలా మాట్లాడటం తన తప్పే అని దిగివచ్చారు. అయితే తాజాగా తన వ్యాఖ్యాలపై శివాజీ వివరణ ఇచ్చారు. దండోర మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా ఆయన ఈ పదాలు వాడేటప్పుడు అక్కడ ఉన్న తన సహా నటీనటులకు, ఆడవాళ్లకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. ఈవెంట్ నుంచి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించానన్నారు.
“గత 30 ఏళ్ల సినీ జీవితంలో అలా మాట్లాడలేదు. రాజకీయాల్లోనూ ఏ రోజూ ఎవరినీ ఒక చిన్న మాట అనలేదు. హద్దు మీరి మాట్లాడలేదు. ఈవెంట్‌లో ఎందుకు అలా మాట్లాడానా? అని బాధపడ్డాను. బయటకు రాగానే, పొరపాటుగా మాట్లాడినట్లు గ్రహించా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. అయితే, నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నా. ఎవరికీ భయపడే పనే లేదు. ఆ రెండు పదాలు మాత్రం మాట్లాడటం తప్పు. నేను నిద్రపోయి 36 గంటలైంది. నాలో అంతర్మథనం మొదలైంది. రాజకీయాల్లోనూ తప్పు మాట్లాడని నేను ఇలా ఎలా మాట్లాడానా? అని ఆలోచిస్తూ ఉండిపోయా. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు” అన్నారు.
అలాగే తాను అలా మాట్లాడటం వెనక ఉద్దేశం ఏంటో వివరణ ఇచ్చారు . ‘స్త్రీ పట్ల, మన దేశంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత, వారి కట్టుబొట్టుపై గతంలో గరికపాటి, చాగంటి కోటిశ్వరరావు, ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు, గంగాధర శాస్త్రీ వంటి ఎంతో మంది పెద్దలు చెప్పారు. స్త్రీ ప్రాముఖ్యత గురించి చెప్పే సందర్భాల్లో వారంత చాలా మాట్లాడారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలా ఉండోద్దు, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట మీరు ఇబ్బందులకు గురవుతారని ఎంతోమంది పెద్దలు, సంప్రదాయం, సంస్క్రతిపట్ల అవగాహన ఉన్నవాళ్లు ఎన్నో చెప్పారు. నేను అలా మాట్లాడాటానికి కారణం.. రెండు రోజుల ముందు లూలూ మాల్తో హీరోయిన్ నిధి అగర్వాల్ పడ్డ వేదన.. ఇబ్బంది పడ్డ సంఘటన నా మైండ్లో నుంచి పోలేదు. ఎంతో అసహనంతో ఆమె కార్లో కూర్చున్నారు. పొరపాటున ఆమె డ్రెస్ ఏమైనా జారిపోయి ఉంటే జీవితాంతం ఆమె బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది.
Also Read: Actor Shivaji: అనసూయ నీ రుణం తొందర్లోనే తీర్చుకుంటా.. శివాజీ కౌంటర్!
ఆ వెంటనే హీరోయిన్ సమంత గారు ఇదే ఇబ్బంది పడ్డారు. ఒకప్పుడు రమ్యక్రష్ణ, జయసుధ, విజయశాంతి వంటి ఎంతో ఫీమేల్ ఆర్టిస్ట్స్ కట్టుకునే చీరలు, బట్టలను షాపుల్లో అమ్మేవారు. మీరు ఏ డ్రెస్ వేసుకోవాలి, వేసుకోవద్దని నేను చెప్పడం లేదు. నేనేవరిని చెప్పడానికి. సమాజంలో ఎలాంటి సంఘటనలు జరిగిన, రుగ్మతలు వచ్చినా.. సినిమా వల్లే అని ఆరోపిస్తున్నారు. సినిమాని ఎవరు అనకూడదనే పంథాలోనే నేను దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో నా నోటి వెంట ఆ రెండు ఎందుకు వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ వ్యాఖ్యల వల్ల నేను కూడా బాధపడ్డాను. నేను అలా మాట్లాడినందుకు మొదటగా నేను నా భార్యకే క్షమాపణలు చెప్పాను. నేనేందుకు నోరు జారానా అని నాకు నేనా చాలా బాధపడ్డాను. ఆ బాధతో నేను బాత్రూంకి వెళ్లి నా కొడుక్కి సారీ చెబుతూ మెసేజ్ చేశాను‘ అని శివాజీ చెప్పుకొచ్చారు.