E-Paper
Advertisement

Food Delivery Rider: ఫుడ్ డెలివరీ చేస్తూ.. రూ.1.42 కోట్లు ఆదా చేసిన పాతికేళ్ల కుర్రాడు, అదెలా సామీ?

Food Delivery Rider: ఫుడ్ డెలివరీ చేస్తూ.. రూ.1.42 కోట్లు ఆదా చేసిన పాతికేళ్ల కుర్రాడు, అదెలా సామీ?
Advertisement

Food Delivery Worker Success Story: ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. చేసే పని ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది ముఖ్యం. చిన్న ఉద్యోగం అని బాధ పడకుండా కష్డపడి పని చేస్తే కచ్చితంగా ఉన్నత స్ధాయికి చేరుకోవచ్చు. అచ్చంగా ఇదే పని చేశాడు చైనాకు చెందిన ఓ పాతికేళ్ల కుర్రాడు. సొంత బిజినెస్ పెట్టి లాస్ అయిన ఆ యువకుడు, ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసి, ఐదేళ్లలో ఏకంగా రూ. 1.42 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

ఇంతకీ ఎవరా కుర్రాడు? ఎలా సక్సెస్ అయ్యాడు?

అతడి పేరు జాంగ్ జుక్వియాంగ్. షాంఘైలో ఉంటాడు. ఫుడ్ డెలివరీ రైడర్‌గా పనిచేస్తూ కేవలం 5 సంవత్సరాల్లో సుమారు రూ.1.42 కోట్లు (1.12 మిలియన్ యువాన్లు)  సంపాదించాడు. 2020లో తన స్వంత బ్రేక్‌ ఫాస్ట్ షాప్ మూతపడటంతో 50,000 యువాన్ల(సుమారు రూ.6.37 లక్షలు) అప్పు అయ్యింది. ఏం చేయాలో తెలియక, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ ఫారమ్ (Meituan)లో రైడర్‌గా జాయిన్ అయ్యాడు. 5 ఏళ్ల పాటు కష్టపడి  1.4 మిలియన్ యువాన్లు (సుమారు రూ.1.78 కోట్లు) సంపాదించాడు. అప్పులు, అవసరాలు తీర్చుకుని 1.12 మిలియన్ యువాన్లు (సుమారు రూ.1.42 కోట్లు) ఆదా చేశాడు.

రోజూ 14 గంటలు కష్టపడిన జాంగ్

Advertisement

జాంగ్ డబ్బులు సంపాదించేందుకు రోజుకు 13-14 గంటలు పని చేసేవాడు. ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఫుడ్ డెలివరీ చేసే వాడు. వారానికి 7 రోజులూ పని చేసేవాడు. సంవత్సరంలో కేవలం చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సమయంలో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకునే వాడు. ఆర్డర్లు డెలివరీ చేసేటప్పుడు టైమ్ సేవ్ చేసుకునేందు ఎప్పుడూ వేగంగా వెళ్లేవాడు. నెలకు 300 పైగా ఆర్డర్లు ఇచ్చేవాడు. మొత్తం 5 ఏళ్లలో 3,24,000 కి.మీ ప్రయాణించాడు.  ఆరోగ్యం దెబ్బ తినకుండా రోజుకు 8  గంటలు నిద్ర పోయేలా ప్లాన్ చేసుకునేవాడు. జాంగ్ కనీస అవసరాలకు మాత్రమే డబ్బులు ఖర్చు చేసేవాడు. లగ్జరీ అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు. ఫ్యూయెల్ ఖర్చు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ బైక్ వాడేవాడు. తోటి రైడర్లు అతడిని ఆర్డర్ కింగ్ అని పిలిచేవారు.

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

వచ్చిన డబ్బుతో ఏం చేయబోతున్నాడంటే?

Advertisement

ఇంత కాలం కష్ట పని సంపాదించిన డబ్బును 2026 ఫస్ట్ హాఫ్ లో  800,000 యువాన్లు (సుమారు రూ.1 కోటి)తో  షాంఘైలో రెండు బ్రేక్‌ఫాస్ట్ షాపులు తెరవబోతున్నాడు. మళ్లీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు.

సోషల్ మీడియాలో జాంగ్ ట్రెండింగ్

జాంగ్ జుక్వియాంగ్ సక్సెస్ స్టోరీ South China Morning Post లాంటి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. డబ్బు సంపాదన కోసం అతడు పడ్డ కష్టాన్ని, పని పట్ల నిబద్ధతను అందరూ మెచ్చుకున్నాయి. కష్టం,  క్రమశిక్షణతో ఏమైనా సాధ్యమే అని నిరూపించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read Also: ఇతడు 1998 నుంచి నడుస్తూనే ఉన్నాడు.. 2026 నాటికి ఇంటికి చేరే ఛాన్స్, ఎందుకలా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×