E-Paper
Advertisement

Sleep: నిద్ర మధ్యలో ఎందుకు మేల్కొంటారు ? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన నిజాలు

Sleep: నిద్ర మధ్యలో ఎందుకు మేల్కొంటారు ? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన నిజాలు

Sleep: అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ రావడం, ఆపై ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం అనేది నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనిని ‘స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా’ అంటారు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు పనిపై ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా..దీర్ఘ కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అర్ధరాత్రి తరచుగా నిద్రలేవడానికి గల కారణాలు, నిద్రను మెరుగుపరుచుకునే మార్గాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిద్ర మధ్యలో మెలకువ రావడానికి కారణాలు:

ఒత్తిడి, ఆందోళన: మన మెదడు విశ్రాంతి తీసుకోకుండా.. రేపటి పనుల గురించి లేదా పాత జ్ఞాపకాల గురించి ఆలోచిస్తున్నప్పుడు.. శరీరం గాఢ నిద్రలోకి వెళ్లదు. దీని వల్ల చిన్న శబ్దానికే మెలకువ వచ్చేస్తుంది.

ఆహారపు అలవాట్లు: పడుకునే ముందు కెఫీన్ (టీ, కాఫీ), ఆల్కహాల్ లేదా భారీ భోజనం చేయడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ నిద్రను రప్పించినట్లు అనిపించినా.. అది నిద్ర నాణ్యతను దెబ్బతీసి మధ్యలో మెలకువ తెప్పిస్తుంది.

నిద్ర రుగ్మతలు: స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస సరిగ్గా అందకపోవడం) లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (కాళ్లు కదిలించాలనే కోరిక) వంటి సమస్యలు నిద్రను పాడు చేస్తాయి.

అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్ : పడుకునే సమయం, లేచే సమయం రోజూ మారుతుంటే.. శరీరం ఎప్పుడు నిద్రపోవాలో నిర్ణయించుకోలేక మధ్యలో మేల్కొంటుంది.

పర్యావరణ కారకాలు: గదిలో ఎక్కువ వెలుతురు ఉండటం, శబ్దాలు, లేదా గది ఉష్ణోగ్రత చాలా వేడిగా లేదా చల్లగా ఉండటం.

2. మెరుగైన నిద్ర కోసం చిట్కాలు:

మంచి నిద్ర కోసం మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

స్థిరమైన సమయం: రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. సెలవు రోజుల్లో కూడా దీనిని పాటించడం వల్ల మీ శరీరంలోని ‘జీవ గడియారం’ క్రమబద్ధం అవుతుంది.

డిజిటల్ డిటాక్స్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, టీవీలను పక్కన పెట్టండి. వీటి నుండి వచ్చే ‘బ్లూ లైట్’ మెలటోనిన్ (నిద్ర హార్మోన్) విడుదలను అడ్డుకుంటుంది.

సరైన వాతావరణం: బెడ్ రూం ప్రశాంతంగా.. చీకటిగ, చల్లగా ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.

Also Read: నైట్ షిఫ్టులతో.. ప్రాణాంతక వ్యాధి, జాగ్రత్త పడకపోతే అంతే !

మధ్యాహ్న నిద్రను నియంత్రించండి: మధ్యాహ్నం పూట 20-30 నిమిషాల కంటే ఎక్కువ సేపు పడుకోకండి. మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రపోతే రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు.

సాయంత్రం వేళ కెఫీన్ వద్దు: మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీ, టీలకు దూరంగా ఉండండి. ఇవి శరీరంలో 6 నుంచి 8 గంటల వరకు ఉండి నిద్రను దూరం చేస్తాయి.

అర్ధరాత్రి మెలకువ వస్తే ఏం చేయాలి ?

ఒకసారి మెలకువ వచ్చాక 20 నిమిషాలైనా నిద్ర పట్టకపోతే.. పడకపైనే అటు ఇటు దొర్లకండి. లేచి పక్క గదిలోకి వెళ్లి తక్కువ కాంతిలో పుస్తకం చదవడం లేదా మెత్తని సంగీతం వినడం చేయండి. మళ్లీ నిద్ర వస్తున్నట్లు అనిపించినప్పుడు మాత్రమే మంచం మీదకు వెళ్లండి. గడియారం వైపు పదే పదే చూడటం మానేయండి. అది మరింత ఒత్తిడిని పెంచుతుంది

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×