E-Paper
Advertisement

Actor Shivaji: సినిమా టికెట్ల రేట్లపై శివాజీ కామెంట్స్..రూ.100 పెంచితేనే ప్రశ్నించాల అంటూ!

Actor Shivaji: సినిమా టికెట్ల రేట్లపై శివాజీ కామెంట్స్..రూ.100 పెంచితేనే ప్రశ్నించాల అంటూ!
Advertisement

Actor shivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇలా చిన్న సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాల వరకు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకుని టికెట్ల రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇలా టికెట్ల రేట్లు పెంచడం వల్ల చాలా మంది థియేటర్ ఎక్స్పీరియన్స్ కు దూరం అవుతున్నారని మరికొందరు కూడా వాదిస్తున్నారు. ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్లే ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకు వస్తున్నారనే వాదన కూడా బయటకు వచ్చింది.

సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ..

ఇలాంటి తరుణంలోనే నటుడు శివాజీ(Shivaji) సినిమా టికెట్ల రేట్ల(Ticket Price) పెంచడం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద పండుగ లాంటిదని చెప్పాలి సంక్రాంతి పండుగ బరిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుతూ దర్శకనిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటారు . ఈ విధంగా సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడం గురించి మరి కొంతమంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నటుడు శివాజీ ఈ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

బస్సు చార్జీలపై మాట్లాడరెందుకు?

Advertisement

సినిమా ప్రేక్షకులకు మూడు గంటల పాటు ఎంతో వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే వారం రోజులపాటు 100 రూపాయల టికెట్ల రేట్లు పెంచుతూ అనుమతి తీసుకుంటారు. ఇలా వంద రూపాయలు పెంచితేనే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పడుతూ ఇండస్ట్రీపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అదే సంక్రాంతి సమయంలో రైలు చార్జీలతో పాటు బస్ టికెట్ల రేట్లు(Bus ticket price) కూడా పెరుగుతున్నాయి. మరి వాటి గురించి ఎవరు ఎందుకని ప్రశ్నించరు అంటూ శివాజీ మాట్లాడారు. ఇలా బస్సు చార్జీలు మూడింతలు ఎక్కువగా పెంచుతున్నారని శివాజీ తెలిపారు.

సంక్రాంతి ఏడాదికి ఒక్కసారే వస్తుంది..

Advertisement

ఈ విషయాల గురించి ఎవరు కూడా నోరు విప్పరు. కానీ సినిమా టికెట్ పై వంద రూపాయలు పెంచితే చాలు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు అంటూ శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది అంటూ కొంతమంది కామెంట్ లు చేయగా మరి కొందరు సంక్రాంతి పండుగ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది.. కానీ సినిమాలు మాత్రం ప్రతివారం వారం విడుదల అవుతూనే ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.సంవత్సరానికి ఒక్కసారి పెంచడానికి ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచడానికి చాలా తేడా ఉంది అంటూ శివాజీ వ్యాఖ్యల పట్ల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Dasari Vignan: ఎన్టీఆర్ పుట్టకముందే కాలర్స్ ఉన్నాయి.. ఫ్యాన్స్ కి దాసరి విజ్ఞాన్ కౌంటర్

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×