Vivo V70 5G: స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన డిజైన్ అప్రోచ్, కెమెరా టెక్నాలజీ, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ కోసం ప్రసిద్ధి చెందిన బ్రాండ్ వివో. 2009లో స్థాపించబడిన ఈ కంపెనీ తక్కువ కాలంలోనే భారత మార్కెట్‌లో తన స్థానం సంపాదించింది. తాజా ఇన్నోవేషన్స్, ఫోటోగ్రఫీ క్వాలిటీ, అప్‌డేటెడ్ లుక్ అన్ని విభాగాల్లో బ్రాండ్ కంటిన్యూ ఇంప్రూవ్ చేస్తూ ప్రీమియం ఫీలింగ్ ఇవ్వగల మోడల్స్‌ను మార్కెట్‌కి తీసుకువస్తోంది. అందుకే ప్రతి లాంచ్ సందర్భంలో వివో పై టెక్ వరల్డ్, యూజర్లలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే స్ట్రెంత్‌తో వివో రాబోయే వి70 5జి మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తుంది. దీనిపై టెక్ ప్రపంచంలో ఆసక్తి పెరుగుతోంది.
డిజైన్ .. గ్లాస్ ఫినిష్‌తో మెటల్ ఫ్రేమ్
వివో తన ప్రత్యేకమైన డిజైన్ స్టైల్ తో మార్కెట్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు కొత్తగా రానున్న వివో వి70 5జి పై టెక్ వరల్డ్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మోడల్ సెల్ఫ్ డిజైన్ స్పెషాలిటీస్‌తో వేరుగా నిలబడబోతుందనే అంచనాలు బలంగా కనిపిస్తున్నాయి. గ్లాస్ ఫినిష్‌తో మెటల్ ఫ్రేమ్ కలయికలో వచ్చే అప్‌డేటెడ్ లుక్, ప్రీమియం క్లాస్ ఫీల్ ఇస్తుందనే లీక్ ఫొటోలు చెబుతున్నాయి. చేతిలో పట్టుకున్న సమయంలో లైట్ వెయిట్ టచ్‌తో కలర్ ఫినిష్ కలిపి మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.
అమోలేడ్ స్క్రీన్ డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే వివో70 5జిలో కర్వ్డ్ అమోలేడ్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎడ్జ్‌ల వద్ద కనిపించే కర్వ్ డిజైన్ ఫోన్‌కు ఫ్లాగ్షిప్ స్టైల్ ఇస్తుంది. బ్రైట్‌నెస్ అవుట్‌పుట్, కాంట్రాస్ట్ లెవల్స్, విజువల్ క్లారిటీ అన్నీ కలిపి తగినంత హై క్వాలిటీ అనుభవాన్ని ఇవ్వవచ్చని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి. హై రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్‌లో స్మూత్ మోషన్ అద్భుతంగా ఉంటుంది. వీడియో ప్లేబ్యాక్, డైలీ యూజ్, గేమింగ్ పరిస్థితుల్లో కూడా డిస్‌ప్లే రెస్పాన్స్ నేచురల్‌గా ఉంటుంది.
ట్రిపుల్ 50ఎంపి కెమెరా సెటప్
కెమెరా సెక్షన్ విషయానికి వస్తే ట్రిపుల్ 50ఎంపి కెమెరా సెటప్ ఈ మోడల్‌లో వస్తుందనే లీక్‌లు చెబుతున్నాయి. వివో ప్రత్యేకంగా కలర్ ప్రొఫైల్స్, డీటైల్ క్లారిటీ పై పనిచేస్తుందని తెలిసిందే కాబట్టి ప్రధాన లెన్స్ లో ఇమేజ్ అవుట్‌పుట్ మరింత రిచ్ గా ఉండొచ్చని అంచనా. నైట్ ఫోటోలలో లైట్ మేనేజ్‌మెంట్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పోర్ట్రెయిట్ షాట్స్ లో ఎడ్జ్ కట్ ఖచ్చితంగా ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీలలో నేచురల్ స్కిన్ టోన్ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Belly Fat: ఎక్కువగా కూర్చుంటే పొట్ట పెరగదండోయ్.. దానికి అసలు కారణం ఇదీ..
పర్‌ఫార్మెన్స్ పరంగా పర్‌ఫెక్ట్
పర్‌ఫార్మెన్స్ సెక్షన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కన్ఫర్మ్ అయ్యింది. ఏఐ హ్యాండ్లింగ్, మల్టీటాస్కింగ్, ఆప్ ఓపెన్ స్పీడ్ వంటి వర్గాల్లో బలంగా పనిచేసే సామర్థ్యం చూపే అవకాశం ఉంది. డైలీ యూజ్, మీడియా యూజ్, గేమింగ్ సహా అన్ని పరిస్థితుల్లో స్మూత్ రిస్పాన్స్ ఇచ్చే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. హీట్ కంట్రోల్ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువసేపు వాడినా స్టేబుల్ గా ఉంటుందనే నమ్మకం ఉంది.
7000mAh భారీ సామర్థ్యం బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే 7000mAh భారీ సామర్థ్యం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. సాధారణ యూజ్‌లో ఒకటిన్నర రోజు వరకు సపోర్ట్ చేయగల శక్తి ఉంది. ఎక్కువ బ్రైట్‌నెస్‌లో వీడియోలు చూస్తూ లేదా సోషల్ మీడియా ఎక్కువసేపు ఉపయోగించినా బ్యాటరీ స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం ఉంది. 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉన్నందున కొద్ది నిమిషాల చార్జ్‌లో పెద్ద శాతం పవర్ పొందవచ్చని అంచనా.
ర్యామ్ 12జిబి వేరియంట్
ర్యామ్ వేరియంట్స్ విషయానికి వస్తే 8జిబి వేరియంట్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కన్పించింది. 12జిబి వేరియంట్ కూడా రాబోవచ్చనే సమాచారం ఉంది. ఎక్కువ ర్యామ్ వేరియంట్ ద్వారా హెవి అప్లికేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్ లో రన్ అవ్వగలవు. చిప్‌సెట్, ర్యామ్, సాఫ్ట్‌వేర్ కలయికలో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ స్టేబుల్‌గా ఉండే అవకాశం ఉంది.
ఇండియాలో లాంచ్.. ధర ఎంతంటే?
ఇప్పుడు ధర విషయానికి వస్తే ఇండియా మార్కెట్‌లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ అయిన రూ.30,000 నుంచి రూ.38,000 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ సోర్సెస్ తెలిపాయి. లాంచ్ డేట్ ఆగస్టు 12, 2026 అన్నది లీక్ అయిన సమాచారం మాత్రమే అయినా అదే టైమ్‌లైన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందనే అవకావం కనిపిస్తున్నాయి.