E-Paper
Advertisement

Dasari Vignan: ఎన్టీఆర్ పుట్టకముందే కాలర్స్ ఉన్నాయి.. ఫ్యాన్స్ కి దాసరి విజ్ఞాన్ కౌంటర్

Dasari Vignan: ఎన్టీఆర్ పుట్టకముందే కాలర్స్ ఉన్నాయి.. ఫ్యాన్స్ కి దాసరి విజ్ఞాన్ కౌంటర్
Advertisement

Dasari Vignan: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు పొరపాటున ఏ విషయంలోనైనా నోరు జారిన ఆ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు మారుతి(Maruthi) సైతం వివాదాలలో నిలిచారు. ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత కాలర్ (Collar)ఎగరేయడం లాంటి మాటలు నేను మాట్లాడను కానీ, ఆ మాటలు ఈ కటౌట్ కి చాలా తక్కువ అంటూ మాట్లాడారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మారుతీ క్షమాపణలు..

ఈ కార్యక్రమంలో మారుతి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక మరే ఉద్దేశం లేకపోయిన సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈయన ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని సెటైర్లు వేశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించడంతో చివరికి మారుతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నా మాటలు వెనుక ఉద్దేశం ఎన్టీఆర్ ని కించపరచడం కాదని, అసలు ఎన్టీఆర్ ను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అంటూ క్షమాపణలు కోరారు. ఇలా మారుతి పట్ల వస్తున్న విమర్శలపై సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ (Dasari Vignan)స్పందించారు.

హర్ట్ అయ్యారంటే వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు..

Advertisement

ఈ సందర్భంగా దాసరి విజ్ఞాన్ బిగ్ టీవీతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవడానికి అక్కడ ఏమీ లేదు. ఒకవేళ హర్ట్ అయ్యారు అంటే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదని, ఎన్టీఆర్ అభిమానుల రూపంలో కొంతమంది విమర్శలు చేస్తున్నారని విజ్ఞాన్ తెలిపారు. కొంతమంది హీరోలు వారి మ్యానరిజంతో ఫేమస్ అయ్యారు కానీ,మ్యానరిజం పై ఎవరికి పేటెంట్ హక్కు లేదని తెలిపారు. ఇక కాలర్ ఎగరేయడం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ పుట్టకముందే షర్టులకు కాలర్స్ ఉన్నాయని విజ్ఞాన్ తెలిపారు. కాలర్ ఎగరేయడం గురించి ఎన్టీఆర్ పట్ల కూడా వార్ 2 సినిమా ఈవెంట్ తర్వాత కూడా విమర్శలు వచ్చాయి. అయితే మారుతి ఇక్కడ కటౌట్ గురించి మాట్లాడారు. ఆ కటౌట్ పక్కన పెట్టి కాలర్ గురించి మాత్రమే ఇష్యూ చేస్తున్నారని విజ్ఞాన్ తెలిపారు.

Advertisement

ఇలా ఎన్టీఆర్ అభిమానులు ఫీలయ్యే విధంగా మారుతి ఏం మాట్లాడలేదని, ఎన్టీఆర్ అభిమానులకు మారుతి క్షమాపణలు కూడా చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కానీ డైరెక్టర్ మారుతి పెద్దరికంతో క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టారంటూ విజ్ఞాన్ ఎన్టీఆర్ మారుతి కాలర్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యే విధంగా మారుతి ఏమి మాట్లాడలేదనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం వివాదానికి తెరలేబరని చెప్పాలి.

Also Read: Ram pothineni: భాగ్యశ్రీ తో లవ్ రూమర్స్.. ట్రోలింగ్స్ పై ఓపెన్ అయిన రామ్..ఏమన్నారంటే?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×