Sumanth Prabhasరెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ పేరుకే హీరో అయినా.. తన సహృదయంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంటున్నారు.. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ప్రభాస్ ను కలిసిన తర్వాత ఆయన మంచి మనసును బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ గొప్పతనాన్ని చెప్పగా .. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) కూడా చేసిన కామెంట్లు, పెట్టిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. “ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్” అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా చిన్న హీరోలు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అంటే .. తమ సినిమా ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున చేపడతారు. ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీలను కలుస్తూ తమ సినిమాను ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సుమంత్ ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కలవడం ఆయన ఈ సినిమాకి శుభాకాంక్షలు చెప్పడం అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే .. సుమంత్ ప్రభాస్ , అనంతిక సనీల్ కుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రోమాంచికం. సెప్టెంబర్ 3వ తేదీన గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుండగా.. సెప్టెంబర్ 2 అనగా నేడు ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రభాస్ ను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభాస్.. సుమంత్ ప్రభాస్ షర్ట్ పై “లైవ్ విత్ ప్రభాస్ ” అని తన హ్యాండ్ రైటింగ్ తో రాయడమే కాకుండా “ఆల్ ది బెస్ట్..ఇరగదీసేయ్.. బ్లాక్ బస్టర్ అయిపోవాలి.. స్పిరిట్ ని కూడా దాటేయాలి ” అంటూ ప్రభాస్ చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న నటుడిని ఈ రేంజ్ లో ఆదరించడం నిజంగా ఆయన గొప్ప హృదయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
also read:నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!
ఇక సుమంత్ ప్రభాస్ ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ..” మాటలు రావట్లేదు.. ఇక నన్ను చంపేసిన పర్వాలేదు ” అనే రేంజ్ లో ఆయన పెట్టిన పోస్ట్, కన్నీళ్లతో నిండిపోయిన ఎమోజీస్ షేర్ చేయడంతో.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే ప్రభాస్ ఒక్క మాటలో తన రియల్ క్యారెక్టర్ ఏంటో నిరూపించారు అంటూ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు రొమాంటిక్ , కామెడీ, సస్పెన్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ హీరోగా ఎనిమిది వసంతాలు, మ్యాడ్ చిత్రాలతో మంచి గుర్తింపు అందుకున్న అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఎగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించారు. ఇక సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని సుమంత్ ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.