E-Paper
Advertisement

Hey Bhagawan: సెన్సార్ ఎఫెక్ట్.. సుహాస్ ‘హే భగవాన్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే!

Hey Bhagawan: సెన్సార్ ఎఫెక్ట్.. సుహాస్ ‘హే భగవాన్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే!
Advertisement

Hey Bhagawan: ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదల కావాలి అంటే సెన్సార్ బోర్డ్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డ్ ఆంక్షలు కారణంగా దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సెన్సార్ సమస్యల కారణంగా కొన్ని సినిమాలు విడుదల కూడా వాయిదా వేసుకుంటూ ఇప్పటికీ విడుదల కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా సినిమా టైటిల్ విషయంలో కూడా ఇటీవల సెన్సార్ బోర్డు దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు టైటిల్ మార్పులు చేయటంతో దర్శక నిర్మాతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సుహాస్ హే భగవాన్..

ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ సినిమా టైటిల్ వివాదంలో మార్పులు చేయాలి అంటూ సెన్సార్ సభ్యులు సూచించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాకి ఏకంగా టైటిల్ మార్చేసిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటుడు సుహాస్(Suhas) హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హే భగవాన్”(Hey Bhagawan). ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి.

హే బలవంత్..

Advertisement

ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ సినిమా టైటిల్ ను మార్చి వేశారు. ఇప్పటివరకు హే భగవాన్ పేరుతో ఉన్న ఈ సినిమా సెన్సార్ కారణంగా హే బలవంత్(Hey Balwanth) అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ అధికారక పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇలా చివరి నిమిషంలో ఈ సినిమా టైటిల్ మార్చడంతో చిత్ర నిర్మాతలు కొత్త టైటిల్ తో ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు.

నరేష్ చేస్తున్న బిజినెస్ ఏంటీ?

Advertisement

సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, కూడా నటించారు. నరేష్ పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇందులో ఈయన ఒక బిజినెస్ చేస్తుంటాడు అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారి సినిమాపై బాగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న సుహాస్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.

Also Read: Prabhas: ఫౌజీ సెట్ లో ప్రభాస్ కు గాయం…క్లారిటీ ఇచ్చిన టీమ్…నిజం ఏంటంటే?

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×