E-Paper
Advertisement

Techno Spark Go 3: నెట్‌వర్క్ లేకపోయినా పనిచేస్తుంది.. భారతీయ భాషల AI అసిస్టెంట్‌తో కొత్త ఫోన్, ధర తెలిస్తే షాకౌతారు!

Techno Spark Go 3: నెట్‌వర్క్ లేకపోయినా పనిచేస్తుంది.. భారతీయ భాషల AI అసిస్టెంట్‌తో కొత్త ఫోన్, ధర తెలిస్తే షాకౌతారు!
Advertisement

Techno Spark Go 3: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అంటే.. కేవలం ప్రాథమిక అవసరాలకు మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఆ అంచనాలను మారుస్తూ టెక్నో సంస్థ భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త 4G మొబైల్ TECNO Spark Go 3ను ప్రవేశపెట్టింది. నిత్యం బిజీగా ఉండే విద్యార్థులు, ఉద్యోగులు, ఫీల్డ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది.

మన్నికకు మారుపేరుగా డిజైన్:

ఈ స్మార్ట్‌ఫోన్‌ను Desh Jaisa Dumdaar అనే ట్యాగ్‌లైన్‌తో టెక్నో ప్రమోట్ చేస్తోంది. అంటే.. స్టైల్‌తో పాటు ఫోన్ పటిష్టతకు కూడా కంపెనీ సమాన ప్రాధాన్యత ఇచ్చింది. ఫోన్ పొరపాటున కింద పడినా తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. అంతేకాదు.. దీనికి ఉన్న IP64 రేటింగ్ వల్ల ధూళి, నీటి నుంచి ఫోన్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు. సిగ్నల్స్ లేని ఏరియాల్లోనూ ఉద్యోగాలు చేసే వారికి ఇదొక భరోసా అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ఇక ఇయర్ ఫోన్స్ అవసరం లేదు మావా.. షియోమీ కొత్త గ్లాసెస్ వచ్చేశాయ్!

స్మూత్ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ:

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్. సాధారణంగా ఈ ధరలో లభించే ఫోన్లలో తక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కానీ ఈ ఫోన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన HD+ డిస్‌ప్లేను అందించడం విశేషం. దీనివల్ల స్క్రీన్ స్క్రోలింగ్, వీడియోలు చూసేటప్పుడు యూజర్లు చాలా మెరుగైన అనుభవన్ని పొందుతారు. ఇక రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా 5000mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చారు.

దేశీ భాషల్లో వాయిస్ అసిస్టెంట్:

Advertisement

భారతీయ వినియోగదారుల సౌలభ్యం కోసం టెక్నో తన సొంత Ella AI వాయిస్ అసిస్టెంట్‌ను ఈ ఫోన్‌లో వాడింది. ఇది కేవలం ఇంగ్లీష్‌కే పరిమితం కాకుండా హిందీ, తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా యూజర్ల ప్రశ్నలకు స్పందిస్తుంది. మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే.. నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న చోట కూడా కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే No Network Communication 2.0 టెక్నాలజీని ఈ హ్యాండ్‌సెట్‌లో వాడారు.

ధర ఎంతంటే?

ఇక ఈ TECNO Spark Go 3 కేవలం ఒకే ఒక వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్ లో లభ్యమవుతోంది. దీని ధరను కంపెనీ రూ.8,999గా నిర్ణయించింది. టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్‌తో పాటు మీకు సమీపంలోని ప్రముఖ మొబైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు.

Also Read: కొత్త టీవీ కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్.. 2026 జనవరిలో ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టీవీలు ఇవే!

 

 

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×