E-Paper
Advertisement

Bajaj Pulsar Price Hike: పల్సర్ లవర్స్ కు షాక్, ధరలు పెంచిన బజాజ్!

Bajaj Pulsar Price Hike: పల్సర్ లవర్స్ కు షాక్, ధరలు పెంచిన బజాజ్!
Advertisement

Bajaj Pulsar Bikes Price Hike: బజాజ్ కంపెకి చెందిన అత్యంత పాపులర్ మోడల్ బైక్ పల్సర్. ఈ బైక్ విడుదలై రీసెంట్ గా 25 సంవత్సరాలు పూర్తి అయినా, ఇప్పటికీ, క్రేజ్ తగ్గలేదు. ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునేలా సరికొత్త అప్ డేట్స్ తో బజాజ్ పల్సర్ ను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా పల్సర్ కు సంబంధించి బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పల్సర్ 125 నుండి పల్సర్ NS400Z వరకు ఉన్న పల్సర్ లైనప్ అంతటా ధరలను పెంచింది. పల్సర్ లైనప్ అంతటా ధరల పెరుగుదల ఉంటుందని ప్రకటించింది. ధరల పెంపునకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పల్సర్ 125 లైనప్ ధరల పెంపు గురించి..

బజాజ్ పల్సర్ 125cc లైనప్‌ లో, N125 బైక్ ధర మాత్రమే పెరగలేదు. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. బజాజ్ పల్సర్ NS125 బేస్ వేరియంట్ ధర.. ఇది ఇతర మోడళ్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

పల్సర్ 150-160cc లైనప్ ధర ఎంత పెరిగిందంటే?

Advertisement

బజాజ్ పల్సర్ N160 మిడ్, టాప్ వేరియంట్‌ తో పాటు, పల్సర్ 150 ధరలను బజాజ్ అలాగే ఉంచింది. N160 బేస్ వేరియంట్.. సింగిల్ సీట్ విత్ ట్విన్ డిస్క్, NS160 లలో ధరల పెరుగుదల మొత్తం మీద చాలా తక్కువగా ఉంది. కేవలం వందల్లో పెరుగుల ఉంది.

బజాజ్ పల్సర్ 200-400cc లైనప్

హై పర్ఫార్మెన్స్ కలిగిన పల్సర్ లైనప్ ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించలేదు.  ఈ లైనప్ లో బైక్స్ ధర రూ.  1,100 లోపు వస్తుంది. మొత్తం మీద కొత్త 2026 ధరలు పెద్దగా ప్రభావం చూపించవు. కొనుగోళ్ల మీద కూడా పెద్దగా ఎఫెక్ట్ పడదు. బైక్స్ తయారీకి సంబంధించి ముడి సరుకుల ధర పెరిగిన నేపథ్యంలో స్వల్పంగా ధరలు పెంచక తప్పలేదని కంపెనీ వెల్లడించింది. అయితే, వినియోగదారుల మీద పెద్దగా ఎఫెక్ట్ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది.

Advertisement

Read Also:  సిటీలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్, ముగ్గురు కలిసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయొచ్చు!

మరిన్ని కొత్త పల్సర్ బైక్స్ విడుదల

అటు ఇంకో విషయం ఏటంటే.. బజాజ్ 2026లో అనేక కొత్త మోడళ్లతో పల్సర్ లైనప్‌ను మరింత విస్తరించే పనిలో ఉంది. అదిరిపోయే అప్ డేట్స్ తో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. త్వరలోనే కొత్తత మోడల్స్ కు సంబంధించి కంపెనీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే సరికొత్త పల్సర్ బైక్స్ ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బైక్స్ తో పోల్చితే, లుక్ పరంగా, ఫీచర్ల పరంగా మరిన్ని అప్ డేట్స్ ఉంటాయని భావిస్తున్నారు.

Read Also: కారు కొనాలనుకునే వారికి ఆ మూడు రోజులు బెస్ట్, ఊహించని డిస్కౌంట్లు పొందవచ్చు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×