E-Paper
Advertisement

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు తేజ సజ్జా.. అమ్మాయి ఎవరంటే?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు తేజ సజ్జా.. అమ్మాయి ఎవరంటే?
Advertisement

Teja Sajja: తేజ సజ్జ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోల కొడుకు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ (Teja Sajja)అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈయన హీరోగా నటించిన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇలా ఒకవైపు తేజ సినిమాలలో నటిస్తూనే మరోవైపు ది ట్రైటర్స్(The Traitors) అనే రియాలిటీ షోకి హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

పెద్దలు కుదిర్చిన వివాహం..

ఇలా కెరియర్ పరంగా తేజ సజ్జ ఎంతో బిజీగా, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తేజసజ్జా పెళ్లి(Teja Sajja Wedding)కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ ఈయన పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి తేజ సజ్జ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు? వీరి పెళ్లి వివరాలు ఏంటి అనే విషయానికి వస్తే.. తేజ సజ్జ ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

నవంబర్ నెలలో నిశ్చితార్థపు వేడుక..

Advertisement

తేజ సజ్జ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని తెలుస్తోంది. వీరి వివాహం పెద్దలు కుదుర్చున వివాహం కావటం విశేషం. ఇక అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన మాటలు పూర్తి అయ్యాయని నవంబర్ నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో తేజ సజ్జ నిశ్చితార్థపు వేడుక జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ నెలలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు సమాచారం.

ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం..

తేజ సజ్జ తన వివాహాన్ని ఉదయపూర్ ప్యాలెస్ లో చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనలో తేజ సజ్జ ఉన్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈయన పెళ్లికి సంబంధించి ఈ విషయం పట్ల అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ విధంగా తేజ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ పెళ్లికి సంబంధించిన ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయాలు తెలియాలి అంటే తేజ సజ్జ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం జై హనుమాన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలతో పాటు మరోవైపు హోస్ట్ గా కూడా తేజ బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!

Related News

వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!

ఖరీదైన టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్.. ధర ఎంతంటే?

ఘనంగా భూమి పూజతో మొదలైన వరుణ్ తేజ్ ‘ బరి’!

ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ లాక్!

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×