E-Paper
Advertisement

Upcoming Smart TVs March 2026: వచ్చేస్తున్నాయ్ ఏఐ స్మార్ట్ టీవీలు.. శాంసంగ్ నుంచి సోనీ వరకు, ఏదైనా బడ్జెట్‌లోనే!

Upcoming Smart TVs March 2026: వచ్చేస్తున్నాయ్ ఏఐ స్మార్ట్ టీవీలు.. శాంసంగ్ నుంచి సోనీ వరకు, ఏదైనా బడ్జెట్‌లోనే!
Advertisement

Upcoming Smart TVs March 2026: ఏళ్ల తరబడి ఇంట్లో ఉన్న ఆ పాత టీవీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో బతుకుతున్నాం. మరి ఇప్పటికీ అదే పాత పిక్చర్ క్వాలిటీ, స్లో ప్రాసెసింగ్‌తో రాజీ పడటం ఎందుకు చెప్పండి? అలాగని స్మార్ట్ టీవీ అనగానే లక్షల రూపాయలు ఖర్చవుతాయని కంగారు పడకండి. మీ బడ్జెట్‌లోనే, అత్యాధునిక ఏఐ ఫీచర్లతో థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే సరికొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్.

ఈ టీవీ మోడల్స్‌లో కేవలం మూవీస్ చూడటమే కాదు.. గేమింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి మార్కెట్లోకి అనేక మోడళ్ల ఏఐ స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. మరి ఆ స్పెషల్ టీవీలేంటో, వాటిలో ఉన్న క్రేజీ ఫీచర్లేంటో ఇప్పుడే చూసేద్దామా..

Samsung Neo QLED 8K

Advertisement

శాంసంగ్ నుండి వస్తున్న ఈ ప్రీమియం టీవీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. దీనిలో కొత్తగా ఏఐ మోషన్ ఎన్‌హాన్సర్ అనే ఫీచర్ ఉంది. దీంతో స్పీడ్‌గా స్పోర్ట్స్ ఛానెల్స్, యాక్షన్ సినిమాలను బ్లర్ లేకుండా చూడొచ్చు. ఈ టీవీ మన ఇంట్లో ఉంటే.. సినిమా థియేటర్ అనుభూతిని పొందవచ్చు. దీని డిజైన్ కూడా చాలా స్లిమ్‌గా ఉండి గోడకు అతుక్కుపోయినట్లు కనిపిస్తుంది.

Sony Bravia XR OLED

ఈ సోనీ బ్రావియా ఎక్స్ఆర్ ఓఎల్ఈడీ టీవీ మూవీ లవర్స్‌కు తెగ నచ్చేస్తుంది. ఈ మోడల్‌లో కాగ్నిటివ్ ప్రాసెసర్ ఉన్నందున, మనిషి కన్ను ఎలాగైతే దృశ్యాలను చూస్తుందో, అంతే నేచురల్‌గా స్క్రీన్ మీద కలర్స్‌ను చూపిస్తుంది. దీనిలో సౌండ్ నేరుగా స్క్రీన్ నుండే వస్తుంది కాబట్టి.. డైలాగులు చాలా స్పష్టంగా వినబడతాయి. అలాగే గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి కూడా ఇది బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Advertisement

Also Read: భారత మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్ 2.. ఇందులో వాడిన అత్యాధునిక ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!

LG AI Evo G5

ప్రముఖ ఎల్జీ తన ఓఎల్ఈడీ టెక్నాలజీతో మరోసారి మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఈ టీవీలో బ్రైట్‌నెస్ మునుపటి కంటే 30 శాతం ఎక్కువగా ఉంటుంది. పగటిపూట వెలుతురులో కూడా టీవీ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే ఇందులోని స్మార్ట్ ఓఎస్ మన అలవాట్లను బట్టి మనకు నచ్చిన షోలను సజెస్ట్ చేస్తుంది. టీవీ చూడటానికి స్టైలిష్ ఉండాలనుకుంటున్న వాళ్లు కచ్చితంగా దీనిని ఇష్టపడతారు.

Xiaomi X Pro Series 2026

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ కొత్త మోడల్ ఫేవరెట్‌గా నిలుస్తుంది. దీనిలో ఎక్స్ ప్రో సిరీస్‌లో డాల్బీ విజన్, 4K క్వాలిటీ అద్భుతంగా ఉంటాయి. గూగుల్ టీవీ సపోర్ట్‌తో వచ్చే ఈ టీవీలో వాయిస్ కంట్రోల్ మెరుగ్గా పనిచేస్తుంది. సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరకు ఈ టీవీని తీసుకురావడం విశేషం.

OnePlus TV U2 Edition

వన్‌ప్లస్ టీవీ యూ2 ఎడిషన్ కలర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటాయి. ఈ కొత్త మోడల్‌లో సినిమాటిక్ డిస్‌ప్లేతో పాటు భారీ స్పీకర్లను అమర్చారు. దీనికి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. ఆఫీస్ ప్రెజెంటేషన్లకు, ఫొటోలు చూసుకోవడానికి ఈ టీవీ సౌకర్యవంతంగా ఉంటుంది.

TCL Mini-LED C-Series

ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి టిసిఎల్ ఈ టీవీని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ టీవీలో గేమ్స్ ఆడుతుంటే ఎక్కడా లాగ్ అవ్వదు. తక్కువ ధరలో మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీని అందిస్తున్న ఏకైక బ్రాండ్ ఇదే కావడం విశేషం. నేచురల్ కలర్స్, డీప్ బ్లాక్ లెవల్స్ ఈ కొత్త మోడల్‌కు ఉన్న ప్లస్ పాయింట్.

Also Read: ల్యాప్‌టాప్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ఇకపై మౌస్ వాడాల్సిన అవసరమే ఉండదు!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×