E-Paper
Advertisement

Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?
Advertisement

Allu Sirish Nainika wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక ఈ జంట మార్చి నాలుగో తేదీ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోబోతున్నారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో అల్లు వారి ఇంటి పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అల్లు శిరీష్ నైనికల వివాహం మార్చి 6వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

మార్చి 6న పెళ్లి పీటలు ఎక్కబోతున్న శిరీష్ నైనిక..

మార్చి ఆరవ తేదీ వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్ళికొడుకు ఫంక్షన్ అలాగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అల్లు స్టూడియోస్ లో శిరీష్ నైనిక ఫ్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరై సందడి చేశారు. ఒకే చోట టాలీవుడ్ తారలందరూ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

అల్లు శిరీష్ నైనిక ప్రీ వెడ్డింగ్ లో కనిపించని మెగా బ్రదర్..

Advertisement

ప్రస్తుతం అల్లు శిరీష్ నైనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో భాగంగా మెగా బ్రదర్స్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్ధం. శిరీష్ మేనమామయ్యలు అయిన చిరంజీవి నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఇలా ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ కనిపించకపోవడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హాజరు కాకపోవడానికి కారణం లేకపోలేదని చెప్పాలి.

చేతికి సర్జరీ కారణంగా..

Advertisement

చిరంజీవి చేతికి సర్జరీ చేయించుకోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అందుకే ఈయన ఈ రిసెప్షన్ లో పాల్గొనలేదని, పెళ్లికి హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ , నాగబాబు రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కూడా శిరీష్ పెళ్లి వేడుకలలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇలా అల్లు ఇంటికి సంబంధించిన కీలకమైన వేడుకలో మెగా బ్రదర్స్ ముగ్గురు కనిపించకపోవడంతో అభిమానులకు చిన్న లోటు కనిపించిందని చెప్పాలి. ఇక ఈ ముగ్గురిని అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు శిరీష్ ఇంటికి వెళ్లి మరి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ఈ వేడుకకు దూరంగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ , ఉపాసన మాత్రం అల్లు శిరీష్ కు సంబంధించిన ప్రతి వేడుకలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Also Read: Janhvi Kapoor:మా పేర్లు వాడుకొని బ్రతుకుతున్నారు.. ఫైర్ అయిన జాన్వీ కపూర్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×