V.K.Naresh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీ.కే నరేష్(V.K.Naresh) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. కెరీర్ మొదట్లో హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన ఇటీవల కాలంలో యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా వీకే నరేష్ నటించిన క్రేజీ కళ్యాణం(Crazy Kalyanam) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనుపమ పరమేశ్వర(Anupama Parameswaran) తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో వీకే నరేష్ కీలకపాత్రలో కనిపించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు కచ్చితంగా ఒకే హెయిర్ స్టైల్ కాకుండా వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ఉపయోగిస్తూ ఉంటారు అందుకోసం ప్రత్యేకంగా విగ్గులు (Wigs)కూడా తయారు చేయించుకుంటూ ఉంటారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇప్పటికీ బయటకు ఎక్కడికి వెళ్లినా విగ్గు వాడుతూనే ఉంటారు.
ఈ నేపథ్యంలోనే నటుడు నరేష్ సైతం బయటకు వచ్చిన ప్రతిసారి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కూడిన విగ్ పెట్టుకొని దర్శనమిస్తుంటారు .ఈ నేపథ్యంలోనే నరేష్ విగ్ ధరకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నరేష్ ఉపయోగించే విగ్ ధర ఒక్కొక్కటి సుమారుగా 2.5 లక్షల రూపాయల విలువ చేస్తాయని తెలుస్తోంది. ఇలా ఈయన విగ్గు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం గురించి స్పందిస్తూ… నరేష్ ధరించే ఒక్కో విగ్ ధరతో ఒక సామాన్య కుటుంబం చాలా లగ్జరీగా బ్రతికేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీలో నరేష్ మాత్రమే కాకుండా పలువురు హీరోలు కూడా ఖరీదైన విగ్గులను ఉపయోగిస్తూ ఉన్నారు. సెలబ్రిటీలకు ఈ ధరలు సర్వసాధారణం అయినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం చాలా ధర అని చెప్పాలి. ఇక నరేష్ విషయానికి వస్తే ఈయన తన వ్యక్తిగత విషయాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అయితే తనపై వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈయన మాత్రం సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా క్రేజీ కల్యాణం సైతం ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
Also Read: జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!