E-Paper
Advertisement

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
Advertisement

Jailer 2 OTT: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ 2(Jailer 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar)దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అక్టోబర్ 15వ తేదీ విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు సుమారు 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో జైలర్ 2..

ఈ విధంగా జైలర్ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. నేపథ్యంలోనే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నవంబర్ 12 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది అయితే నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 12వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి ప్రైమ్ వీడియో అధికారక ప్రకటన తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా విజయ్ దేవరకొండ రణబాలి సినిమాకు పోటీగా ప్రసారమవుతూ భారీగా కలెక్షన్లను రాబడుతోంది.

భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న జైలర్ 2..

ఇక జైలర్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతోనే సీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో రజినీకాంత్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా.. యోగి బాబు, మిథున్ చక్రవర్తి, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, విద్యాబాలన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో వివిధ భాష నటీనటులు భాగం కావడంతో ఈ సినిమా తమిళ భాషలో మాత్రమే కూడా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Also Read: రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ప్రేమ, పగ మధ్య నలిగిపోయే గ్యాంగ్‌స్టర్‌… వెన్నులో వణుకు పుట్టించే ఊచకోత… తెలుగులో తమిళ యాక్షన్ డ్రామా

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఛారిటీ పార్టీకి వెళ్లిన స్టార్‌ హీరో… అగ్నిపర్వతం దగ్గర బలి… ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Big Stories

Advertisement
×