E-Paper
Advertisement

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!
Advertisement

Groundwater Crisis: రాష్ట్రంలో భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు విస్తరిస్తున్న పట్టణీకరణ, వ్యవసాయ అవసరాలు.. దీంతో భూగర్భజలాలపై వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు వర్షపాతం, భూమిలోకి ఇంకే నీటి పరిమాణం, భూగర్భజలాల వినియోగం మధ్య సమతుల్యత దెబ్బతిని నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని భూగర్భ జల వనరుల శాఖ నివేదిక వెల్లడిస్తుంది.గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనూ, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

గణాంకాలు..

గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సగటున 5 మీటర్ల మేర భూగర్భజలాల మట్టం పడిపోయినట్లు పేర్కొంటున్న గణాంకాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణపై ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.

నగరాల్లో నానాటికీ తగ్గుతున్న జలాలు

Advertisement

రాష్ట్రంలో భూగర్భజలాలు తగ్గుతున్న ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్‌ ముందువరుసలో ఉంది. జనాభా పెరుగుదలతోపాటు నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలు విస్తరిస్తుండటంతో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జలాలను తోడిపోస్తున్న వేగానికి అనుగుణంగా భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేదు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో జలమట్టాలు పెరగలేదు. దీంతో వేగంగా భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.

8 నుంచి 12 మీటర్ల లోతు..

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో భూగర్భజలాల నీటిమట్టం 3.57 మీటర్ల నుంచి 10.01 మీటర్లకు పడిపోయింది. సుమారు 6.44 మీటర్లు లోతుగా నమోదైంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 6.29 మీటర్లు, వికారాబాద్‌ జిల్లాలో 6.17 మీటర్ల లోతులో నీటిమట్టాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నీరు 8 నుంచి 12 మీటర్ల లోతుకు చేరినట్లు సమాచారం. ప్రాంతాలవారీగా నీటిమట్టాల్లో వ్యత్యాసాలు ఉండటం, ఒకే జిల్లాలో కొన్ని చోట్ల పరిస్థితి మెరుగ్గా ఉండగా మరికొన్ని చోట్ల దిగజారడం గమనించాల్సిన అంశం.అదే విధంగా మహబూబ్‌నగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 9 నుండి 13 మీటర్ల లోతుకు పడిపోయిన మట్టాలుపడిపోయాయి. నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 8 నుంచి 12 మీటర్ల లోతుకు, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల వంటి కెనాల్ ఆయకట్టు ఉన్న జిల్లాల్లో 4 నుంచి 7 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లిన ప్రాంతాలు ప్రమాదకర కేటగిరీలోకి చేరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also read: ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

భూమిలోకి ఇంకేదెంత?

పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, కాంక్రీట్‌ నిర్మాణాలు, పేవ్‌మెంట్లు పెరగడంతో వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు ఆక్రమణలకు గురికావడం లేదా వాటి నిల్వ సామర్థ్యం తగ్గడం కూడా నీటి నిర్వహణపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్‌లో భూగర్భజలాల తగ్గుదలకు వర్షపాతం లోటుతోపాటు వర్షపు నీటిని సమర్థంగా భూమిలోకి ఇంకించలేకపోవడం, పట్టణీకరణ వంటి అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

బోర్లు విఫలమైతే పరిస్థితి ఏమిటి?

భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లడం వల్ల గృహాలు, అపార్ట్‌మెంట్లు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ బోర్లపై ఆధారపడే కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నీటిమట్టం తగ్గినకొద్దీ కొన్ని బోర్లలో నీటి సరఫరా తగ్గవచ్చు. మరికొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త బోర్లు వేయడం, ఇప్పటికే ఉన్న బోర్లను మరింత లోతుకు తీసుకెళ్లడం వంటి చర్యలతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది.

వ్యవసాయరంగంపై ప్రభావం..

వ్యవసాయ రంగంలోనూ నీటి లభ్యత కీలకం. సాగు అవసరాలకు భూగర్భజలాలపై అధికంగా ఆధారపడే ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గితే పంటల సాగు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బోర్ల నిర్వహణకు విద్యుత్తు వినియోగం పెరగడం, నీటిని పైకి తోడేందుకు ఎక్కువ శ్రమ అవసరం కావడం రైతులకు అదనపు భారంగా మారనుంది. అయితే ఈ ప్రభావాల తీవ్రత స్థానిక భౌగోళిక పరిస్థితులు, బోర్ల లోతు, పంటల రకం, ప్రత్యామ్నాయ నీటి వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 53,685 జలవనరుల్లో 53,244 జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

గత ప్రభుత్వం..

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను బంద్ పెట్టి, నీళ్లు లిఫ్ట్ చేయకపోవడమే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కారణమనే ప్రచారం జరుగుతుంది. ప్రాజెక్టు నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కుంటలు, పెర్కోలేషన్ ట్యాంకులు ఎండిపోయి అడుగంటుతున్నాయని, భూగర్భ జలాలు అమాంతం క్షీణించి బోర్లలో నీటి లభ్యత పడిపోవడంతో రైతులు బోర్లు వేసి అప్పులపాలవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపడంతో 400 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం పెరిగిందని, దీంతో సాగు, తాగునీటి కొరత రాలేదనే ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్రైతుల పొలాలకు నీరివ్వకుండా, కనీసం చెరువులను నింపే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంతో పల్లెల్లో మళ్లీ కరవు పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రాజెక్టులు డెంజర్ బెల్..

రాష్ట్రంలోని క్రిష్ణాగోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులు డెంజర్ బెల్ ను మోగిస్తున్నాయి. గతేడాది కంటే తక్కువ నీటి మట్టం ఉంది. ఎల్ నినో ఎఫెక్టు రాష్ట్రంపై స్నష్టమైన ప్రభావం చూపుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం215.81 టీఎంసీలకు గాను 64.42 టీఎంసీలు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయానికి 207.85 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్ లో 312.03 టీఎంసీలకు గాను 189.16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది 310.85 టీఎంసీల నీరు ఉంది. సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకు 3.46 టీఎంసీలే ప్రస్తుతం ఉంది. గతేడాది 16.62 టీఎంసీల నీరు ఉంది. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.80 టీఎంసీలకు 10.50 టీఎంసీలు మాత్రమే ఉంది.

ఇంకా లొతుకు వెళ్లే పరిస్థితి..

గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. శ్రీరాంసాగర్ లో సైతం 80.50 టీఎంసీలకు 41.42 టీఎంసీలు ఉంది. గతేడాది పూర్తిస్థాయిలో నీరు ఉంది. మిడ్ మానేరులో 27.55 టీఎం సీలకు 23.44 టీఎంసీలు, లోయర్ మానేరులో 24.03 టీఎంసీలకు 15.45 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 3.50 టీఎంసీలకు 2.97 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకు 18.20 టీఎంసీలు ఉంది. గతేడాది అక్టోబర్ 15 నాటికి 20.18 టీఎంసీలు ఉన్నట్లు అధికారగణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు ఇంకా లొతుకు వెళ్లే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నాయి. అయితే ఈ కరువు పరిస్థితులను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.

Also read: యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

Tags

Related News

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×